కృష్ణ

పట్టాదారు పాస్‌పుస్తకాల తయారీలో పారదర్శకత ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: పట్టాదారు పాస్ పుస్తకాలు ఇతరత్రా భూ లావాదేవీల రికార్డులను సమర్థవంతంగా నిర్వహించే పారదర్శకత దిశగా చర్యలకు రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ పునిత్ తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం రాత్రి వెబ్‌ల్యాండ్, తదితర రెవెన్యూ అంశాలపై జిల్లాకు చెందిన 18 మండలాల తహశీల్దార్లతో రెవెన్యూ డివిజన్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ కమిషనర్ మాట్లాడుతూ పౌరసేవలు అందించడంతోను, భూ సంబంధ రికార్డుల నిర్వహణలో మరింత వేగవంతమైన పనితీరు పెంచుకోవాలన్నారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా రికార్డుల వివరాల ప్రక్రియలో ప్రగతి తప్పనిసరిగా చూపాలని అనిల్‌చంద్ పునీత్ స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల నిర్వహణ, సీలింగ్ ల్యాండ్‌ల ముటేషన్, నీటి తీరువా పన్ను వంటి తదితర అంశాలపై రెవెన్యూ యంత్రాంగానికి పునశ్చరణ తరగతులు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకు సూచించారు. మీ సేవ, మీ ఇంటికి-మీ భూమి, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి రికార్డులను ఆధార్ సంఖ్యతో క్రోడీకరించడంలో పూర్తిస్థాయిలో, 100 శాతం లక్ష్యాలను సాధించాలని తెలిపారు. నానాటికీ భూముల విలువలు గణనీయంగా పెరగడం, పరిశ్రమల తదితర అవసరాలకు భూముల లభ్యత అవశ్యకత పెరుగుతున్నందున ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు.
కృష్ణాజిల్లాలో 18 మండలాలకు చెందిన పనుల నిర్వహణలో వెనుకబాటు కనపడుతోందని జగ్గయ్యపేట, ఉయ్యూరు, పమిడిముక్కల, గుడివాడ తదితర మండల తహశీల్దార్లు వెనుకబడి ఉన్నారన్నారు. సత్వరం చర్యలు తీసుకుని ఆయా మండల స్థాయిలో ఉన్న పెండింగ్ పనులు వేగవంతంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో మరింత మెరుగైన విధానంలో పనులను, భూ రికార్డులను నమోదు ప్రక్రియను వేగంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలాల పరిధిలో వెనుకబాటు ఉన్న అంశాలు వారీగా ఆయా అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. మీ సేవలో 19వేలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లాకు చెందిన 88 శాతం మేర లక్ష్యాలను పూర్తిచేయగలిగామని పేర్కొన్నారు. ఈ క్రాఫ్టు ద్వారా జిల్లాలో 17 లక్షల 76వేల 299 రికార్డులను నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 17 లక్షల 22వేల రికార్డులను నమోదు చేయగలిగామన్నారు. మ్యూటేషన్‌కు చెందిన 11వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇంకా తొలగించాల్సిన డూప్లికేటు పాసు పుస్తకాలకు సంబంధించి 625 కేసులు పరిష్కారం చేయవలసి ఉందన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ జి.సృజన, జి.లక్ష్మీషా, ఆర్‌డివోలు డి.సాయిబాబా, డి.చక్రపాణి, 18 మండలాలకు చెందిన తహశీల్దార్లు, కలెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.
లాభసాటి వ్యవసాయం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 4: అతి తక్కువ పెట్టుబడులు, అధిక దిగుబడులను సాధించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్యమంత్రి ఏ దేశంలో పర్యటించినా ముందుగా వ్యవసాయ రంగంపైనే చర్చలు జరుపుతున్నారని, అక్కడి అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నదే ఆయన తపనయని అన్నారు. ఫార్మర్లు, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ను స్థాపించి తద్వారా రైతులే నేరుగా ఆన్‌లైన్ ద్వారా డిమాండ్ కల్గిన దేశాలకు నేరుగా తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేలా ఇప్పటికే నాలుగు దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. 13 జిల్లాల్లో 25రకాల ఉత్పత్తులను ఈ విధానం ద్వారా విక్రయాలు జరిపి ఐదు లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారంటూ వంద నుంచి వెయ్యి మందితో ఒక్కో ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయదలచామన్నారు. ఏ కనె్వన్షన్‌లో మూడురోజులపాటు జరిగే అగ్రి, డెయిరీ టెక్ ఫెయిర్‌ను మంత్రి ప్రత్తిపాటి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్‌కు చెందిన ప్రేమ జిల్బెర్‌మని ఇక్కడి రైతుల కోసం ఎంతో శ్రమకు ఓర్చి ఈ ప్రదర్శనను ఏర్పాటుచేయటం ముదావహమన్నారు.