కృష్ణ

కమిషన్‌తో కాపులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: కాపు రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కమిషన్‌తోనే కాపులకు న్యాయం జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ వివరాలను నారాయణ మీడియాకు వెల్లడించారు. కాపు వర్గానికి రిజర్వేషన్ రావాలంటే కమిషన్ వేయకుండా జీవో ఇస్తే రాదనేది అందరికీ అర్థమైందన్నారు. అంతకు ముందు జీవో 30 ఇస్తే సరిపోతుందన్నారని, రిజర్వేషన్ ఏబిసిడిఇలు ఉన్నాయని కాపులను ఏ కేటగిరిలో పెట్టాలో చెప్పకుండా జీవో ఎలా చెల్లుతుందని ఆయన ప్రశ్నించారు. కాపులను ఏ కేటగిరిలో పెట్టాలి, ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దానిపై ఒక కమిషన్ వేసి, ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ఒక పద్ధతిగానే కాపు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు కమిషన్ వేసిందని నారాయణ వెల్లడించారు.

8 నుంచి పట్టాలపై రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

విజయవాడ (రైల్వే స్టేషన్), ఫిబ్రవరి 4: ఈ నెల 8 నుంచి విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్‌గా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కె వేణుగోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆదివారం తుని రైల్వేస్టేషన్‌కు సమీపంలో జరిగిన కాపు మహాగర్జనలో భాగంగా కొంత మంది రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన విషయం విదితమే. దీంతో నాటి నుంచి రద్దు చేయబడిన ఈ రైలును ఈనెల 8న సోమవారం నుంచి యథావిథిగా నడుస్తోందని ఆయన తెలిపారు. తగలబెట్టిన బోగీల్లో 24 బోగీలు కాలిపోయిన కారణంగా ఇరువైపుల ఈ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం రెండు గార్డు కమ్ లగేజీతోపాటు మహిళా జనరల్ బోగిలు, నాలుగు సాధారణ బోగీలు, ఎనిమిది సిట్టింగ్ రిజర్వేషన్ బోగీలు, ఒక ఏసి చైర్‌కార్‌తోపాటు ఒక ప్యాంటరీ కార్‌తో కలిపి మొత్తం 16 బోగీలతో ఈ నెల 8 నుంచి నడపడం జరుగుతోందని వేణుగోపాలరావు తెలిపారు. మరో కొద్దిరోజుల్లో మిగిలిన ఎనిమిది బోగీలను ఏర్పాటు చేసి మొత్తం 24 బోగీలతో పూర్తి స్థాయిలో రైలును నడపడం జరుగుతుందని ఆయన వివరించారు. సేకరించిన సమాచారం ప్రకారం రైల్వేబోర్డుకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబడిన సమాచారం తెలుసుకున్నారు. అయితే ఈ విషయంలో ప్రయాణికుల సౌకర్యార్థం యుద్ధప్రాతిపదికన చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీతోపాటు దక్షిణ ప్రాంతంలో ఉన్న కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ నుండి కలిపి ఇరవై కొత్త బోగీలు తీసుకురాడానికి ఇప్పటికే ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది తరలివెళ్లారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే 9 బోగీలను ఇరు ప్రాంతాల నుంచి సిద్ధం చేశారు.