కృష్ణ

నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించే దిశగా బందరు రోడ్డులో సర్వేపై నివేదికలు అందించడంలో సిస్కో ప్రతినిధులు పనితీరు ఫలవంతమయ్యేలా పరస్పరం ప్రతినిత్యం ప్రగతిపై సమీక్షించుకోవాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్మార్ట్ విజయవాడ ప్రాజెక్టుపై కలెక్టర్‌ను సిస్కో ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పనులను అనుకున్న సమయంలో పూర్తి చెయ్యాలంటే ఇద్దరి మధ్య సమాచార లోపం ఉండకూడదన్నారు. సిస్కో ద్వారా నగర పరిధిలో చేపడుతున్న పనుల వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని తెలిపారు. సిస్కో పనుల స్థితిగతులపై సమన్వయ శాఖలతో కూడి రూపొందించిన టెలిగ్రాం యాప్‌లో గ్రూప్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ విధిగా టెలిగ్రాం యాప్ డౌన్‌లోడు చేసుకోవలసి ఉంటుందన్నారు. మార్చి 31 నాటికి పనులను క్షేత్రస్థాయిలో అమలుకు చొరవ చూపాల్సింది సిస్కోనే అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన సాంకేతిక సామగ్రి, మానవ వనరులు, కార్యాలయ నిర్వహణ వంటి వాటిపై నివేదిక అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేపట్టిన పూర్తిచేసిన పనుల వివరాలపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులను సమయపాలనతోకూడి చేపట్టవలసి ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పనులను పూర్తి చేయాలంటే పనులు జరిగే ప్రాంతంలో ఉండి చేపడితేనే లక్ష్యాలను సాధించగలుగుతామని కలెక్టర్ పేర్కొన్నారు.
సిస్కో బృందం ప్రతినిధి సునీల్ వివరాలు తెలుపుతూ, విజయవాడ నగరంలో చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టులో బజాజ్ కంపెనీ బృందంతో కలిసి సమన్వయంతో పనులను, సాంకేతిక పరిజ్ఞానం, పరస్పర సహకార ధోరణిలో చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటికే స్మార్ట్ విజయవాడకు చెందిన యాప్‌ను రూపొందించామని తెలిపారు. అదే విధంగా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చర్యలు పూర్తి చేశామన్నారు. సాంకేతిక పరికరాలను హాంగ్‌కాంగ్ నుండి తీసుకుని రావడం జరుగుతోందని, షిప్పింగ్‌లో ఉన్నట్లు సునిల్ తెలిపారు. స్కూల్ ఎక్విప్‌మెంట్‌కు చెందిన ఎనేబుల్ ఎడ్యుకేషన్ మెటీరియల్‌ను బెంగుళూరు నుండి తీసుకుని రావడం జరుగుతోందని వెల్లడించారు. డేటా కేబుల్స్, కెమెరాలు తదితర సామగ్రి అందుబాటులో ఉన్నట్లు సునీల్ పేర్కొన్నారు.

అవినీతి చర్యలతో నగర ప్రతిష్ఠను దెబ్బతీయద్దు
* తన పేరున డబ్బు వసూలు చేయడం హేయం
* బిపిఎస్ వైఫల్యానికి అధికారులే కారణం
* టౌన్‌ప్లానింగ్ అధికారులపై విరుచుకుపడ్డ మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 4: విఎంసి ఖజానాకు చేరాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది, ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందో వేరే చెప్పనక్కర్లేదంటూ విఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి అక్రమాలపై విరుచుకుపడ్డారు. ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్స్ మరియు బిపిఎస్ అమలుపై నగరానికి చెందిన లైసెన్స్ ఇంజనీర్లతో గురువారం సాయంత్రం కౌన్సిల్‌హాల్లో సమావేశంలో టౌన్‌ప్లానింగ్ అధికార సిబ్బంది చర్యలపై మండిపడ్డ వైనం చర్చనీయాంశం కాగా ఊహించని రీతిలో మేయర్ శ్రీ్ధర్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌పై అవినీతి అరోపణలు అందరినీ ఆశ్చర్యపర్చాయి. కొంతకాలంగా నగర వ్యాప్తంగా పెరిగిపోతున్న అనధికార, అక్రమ నిర్మాణాలతోపాటు నగరంలో బిపిఎస్ పథకం నిర్వీర్యమైన వైఖరిపై మొట్టమొదటి సారిగా బహిరంగంగా పెదవి విప్పిన ఆయన అధికారుల తీరును తప్పుపడుతూ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయని, ఉద్యోగుల అవినీతి చర్యలతో వాటికి తలవంపులు తేవద్దంటూ కోరారు. అవినీతి సొమ్ముతో మనం బంగారం, బట్టలు కొనుక్కొన్నా సభ్య సమాజం హర్షించదని, అవినీతి మరకలతో మనకే కాకుండా మన కుటుంబానికి సైతం అంటి గౌరవ మర్యాదలు కోల్పోవలసి వస్తుందని హితవుపలికారు. 11లక్షల నగర జనాభా అభివృద్ధికై ఖజానాకు చేరాల్సిన సొమ్ము ఖజానాకే చేరే విధంగా ఇకనైనా చర్యలు తీసుకోవాలంటూ శ్రీ్ధర్ పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి నెలకు రెండువందలకుపైగా ప్లాన్ దరఖాస్తులు రావాల్సి ఉండగా కేవలం 80 ప్లాన్లు మాత్రమే వచ్చి రెండున్నర నెలలుగా సుమారు 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణదారుల వద్ద వసూలు చేస్తున్న వేలు, లక్షలాది రూపాయలను సిటీప్లానర్ పేరునే కాకుండా మేయర్‌కు కూడా ఇవ్వాలంటూ చేస్తున్న దుష్ప్రచారం మరింత హేయమన్నారు. ప్రస్తుత నగర మేయర్‌గా ఏడాదిన్నర కాలం నుంచే కాకుండా గతంలో కార్పొరేటర్‌గా చేసిన హయాంలో కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క రూపాయి ఈవిధంగా వసూలు చేశానని రుజువు చేస్తే తన ఆస్తిమొత్తాన్ని రాసిచ్చేస్తానంటూ ఉద్యోగులకు సవాల్ విసురుతూ అలాంటి దుష్ప్రచారాలను మానుకోవాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే నగరంలో బిపిఎస్ నిర్వీర్యమైందన్నారు. బిపిఎస్ ద్వారా 15వేల దరఖాస్తులు వస్తాయని ఆశించగా కేవలం 6,800 మాత్రమే రావడం గమనార్హమన్నారు. 40కోట్ల ఆదాయం లక్ష్యానికి కేవలం 50లక్షలు మాత్రమే ఆదాయం చేకూరిందన్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వే బిపిఎస్ సర్వేలనైనా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ రోజుకు 25 సర్వే చేయాలని, ఏరోజు కారోజు సర్వే పై నివేదిక అందజేయాలని సూచించారు. బిపిఎస్‌కు దరఖాస్తు చేసుకోని భవనాలపైనే కాకుండా అనధికార, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మరిన్ని నిర్మాణాలకు పురికొల్పిన వైనం శోచనీయమని మేయర్ శ్రీ్ధర్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాకముందు విఎంసి 500 కోట్ల అప్పు, 5 నెలల ఉద్యోగుల జీతాల బకాయిలతో ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి 150 కోట్ల బకాయిలను తీర్చడమే కాకుండా ప్రస్తుతం ప్రతి నెలా జీతాలను ఇవ్వగలుగుతున్నామన్నారు. నిబంధనల ప్రకారం నిజాయితీగా ఉద్యోగులు పనిచేస్తే అప్పులకు మించి ఆదాయాన్ని చవిచూడవచ్చని తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి ప్రతి పైసాను కూడా విఎంసి ఖజానాకు చేర్చే బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రతి బిల్డింగ్‌కు ప్లాన్ దరఖాస్తు చేయించడమే కాకుండా బిపిఎస్ సర్వేలో కూడా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లతోపాటు లైసెన్స్‌డ్ సర్వేయర్లు కూడా సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను రాబట్టాలని హితవుపలికారు. ఈ సమావేశంలో టిడిపి ఫ్లోర్ లీడర్ జి హరిబాబు, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్లు హరిజానాయక్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లింల హక్కుల సాధనకు
ప్రాణత్యాగాలకూ సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 4: ముస్లింల హక్కుల సాధనకై ప్రాణత్యాగాలకైనా తాము సిద్ధంగా వున్నామంటూ గురువారం నాడిక్కడ ఓ హోటల్‌లో జరిగిన ముస్లిం మేధావుల ఫోరం సదస్సులో పాల్గొన్న పలువురు ప్రకటించారు. డాక్టర్ అబ్దుల్ రెహ్మాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, వైకాపా నేత షఫీ, కాంగ్రెస్ నేత సలీం, సిపిఎం నేత కరీముల్లా, మాజీ ఎమ్మెల్యే షేక్ నాసర్‌వలీ, యూత్ వెల్ఫేర్ గౌరవాధ్యక్షుడు అబ్దుల్ రహీం, న్యాయవాది అల్త్ఫా, ముస్లిం సంక్షేమ సమితి కార్యదర్శి అల్త్ఫా రాజా, బషీర్, తెదే నుండి ఫతావుల్లా తదితరులు పాల్గొన్నారు. ఫోరం కార్యదర్శులు ఫారూక్ షుబ్లి, న్యాయవాది అబ్దుల్‌మతీన్ మాట్లాడుతూ ముస్లిం జనాభా 13 శాతంగా వుందని అయితే ప్రభుత్వం 2011 లెక్కల ప్రకారం 7.32 శాతంగా చెబుతున్నారన్నారు. ముస్లింలలో 90 శాతం మంది నిరుపేదలేనన్నారు. వాస్తవానికి వీరి పరిస్థితి ఎస్‌సి, ఎస్‌టిల కన్నా దుర్భరంగా ఉందన్నారు. తక్కువ ముస్లిం జనాభా వున్న కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలు ముస్లింల కోసం మన కంటే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయిస్తున్నాయన్నారు. తెదే పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఐదు లక్షలు వడ్డీలేని రుణం, ఇస్లామిక్ బ్యాంక్ స్థాపన, కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, ఇంగ్లీషు మీడియంలో గురుకుల పాఠశాలలు, మదరస్సాలోని విద్యార్థులకు ఉచిత బస్‌పాస్, దుస్తులు, అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములపై చట్టపరమైన చర్యలు ఇలా వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు.

అర్బన్ బ్యాంక్ ఛైర్మన్‌గా సాయిబాబు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 4: మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బొర్రా సాయిబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఎనిమిది మందిని డైరెక్టర్లుగా నియమించారు. తెలుగుదేశం స్థాపించిన నాటి నుండి పార్టీకి సేవలు అందించిన సాయిబాబు మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావుకు అత్యంత సన్నిహితుడు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా అర్బన్ బ్యాంక్‌కు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు. డైరెక్టర్లుగా చలమలశెట్టి హరేరామ్, వాకముల్లు శ్రీనివాసరావు, అద్దేపల్లి మధుసూదనరావు, మీనపల్లి నాగేశ్వరరావు, కొల్లిపర వికెఎస్ నరసింహరావు, సింహాద్రి చెల్లారాయుడు, అద్దేపల్లి నిరంజనరావు, సయ్యద్ అజీజుద్దీన్ (అన్సారి)లను నియమించారు. నూతన పాలకవర్గం ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సాయిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు హాజరవుతారని వివరించారు.

జీవో 279ను రద్దు చేయాలని
మున్సిపల్ కార్మికుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 4: మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి (ఎఐటియుసి) పిలుపు మేరకు జీవో నెం. 279ని వెంటనే రద్దుచేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. ఈసందర్భంగా ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్ మాట్లాడుతూ గత 16రోజుల సమ్మెకాలంలో సెలవులు సర్దుబాటు చేయాల్సిన జీవోను విడుదల చేయాలని, పర్మినెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి జిపిఎఫ్ నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించని పక్షంలో 8 నుండి రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుమూడి రామారావు, సంఘం అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి దుర్గాప్రసాద్ నాయకత్వం వహించారు. చైతన్య, రామకృష్ణ, తులసి, సామ్రాజ్యం, రమణమ్మ, అర్జునరావు, విశ్వనాథ్ పాల్గొన్నారు.

పెన్షన్ కోసం లబ్ధిదారుల అవస్థలు
బంటుమిల్లి, ఫిబ్రవరి 4: బ్యాంకుల ద్వారా వచ్చే పెన్షన్ల కోసం లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలంలో కొన్ని పంచాయతీల కార్యదర్శులు, విఆర్‌ఓల ద్వారా, మరికొందరికి బ్యాంక్ ఆన్‌లైన్ ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే బ్యాంకుల ద్వారా ఆయా పంచాయతీలకు ఇవ్వాల్సిన పెన్షన్లు లబ్ధిదారులకు సకాలంలో అందడంలేదు. ఉదయం నుంచి ఆయా పంచాయతీల కార్యాలయాల్లో సాయంత్రం వరకు పడిగాపులు పడుతున్నా పెన్షన్లు అందటం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలో పడిగాపులు పడ్డారు.
తలనొప్పిగా మారిన పంపిణీ
అవనిగడ్డ : స్థానిక పంచాయతీ కార్యాలయంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం తలనొప్పిగా మారింది. జిల్లా కలెక్టర్ 1వ తేదీకే పెన్షన్ల పంపిణీ జరగాలని ఆదేశిస్తుండగా నగదు బట్వాడా చేసే మిషన్లు మోరాయించడంతో సమస్య ఎదురవుతోంది. పంచాయతీ పరిధిలో 1953 పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం బుధవారం ఉదయానికి 1002 పెన్షన్లు మాత్రమే జారీ అయినట్లు ఇఓఆర్‌డి పద్మజ్యోతి తెలిపారు. మిషన్లు సక్రమంగా పనిచేస్తే ఈరోజే బట్వాడా చేస్తామన్నారు. దీంతో పెన్షనర్లు పడిగాపులు పడుతున్నారు.

సర్కారుకు సమ్రగ
నివేదిక సమర్పిస్తా
* జస్టిస్ మంజునాథ
గన్నవరం, ఫిబ్రవరి 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం ప్రభుత్వ విధివిధానాల ప్రకారం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తానని కాపు రిజర్వేషన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ స్పష్టీకరించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈసందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ కమిటీ చైర్మన్‌గా తనను ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు. సిఎం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కాపు సంఘం చైర్మన్ చలమలశెట్టి రామానుజయ రిజర్వేషన్ కమిటీ చైర్మన్ మంజునాథకు ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం పలికారు. అనంతరం రామానుజయ మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం స్థితిగతులను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే నివేదిక సమర్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రిజర్వేషన్ కమిటీ పర్యటించి అందరి అభిప్రాయ సేకరణ చేస్తుందని తెలిపారు.

స్థానిక సంస్థల బలోపేతానికి కృషి

* ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 4: స్థానిక సంస్థల బలోపేతానికి పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసరనేని మురళి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ముద్రించిన డైరీలు, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో మురళి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పోరాటాలు చేయకుండానే ఆయనకు ఉన్న పరపతితోనే ప్రభుత్వంతో మాట్లాడి ఐదు సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వార్డుకి ఎన్నిక కాలేని వ్యక్తులను ఇందిరమ్మ కమిటీలో వేసి సర్పంచ్‌ల ముందు కూర్చోపెట్టారని, ఆ విధానానే్న తాను ఆనాడు, ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నానన్నారు. జిల్లా ఎంపిటిసిల సంఘం అధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు జెడ్పీటిసి పద్మావతి, ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి ఆయనను సన్మానించారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ రవి, జిల్లా ఎంపిటిసిల సంఘం ప్రధాన కార్యదర్శి మూడే శివశంకర్, వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు, ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జెఎన్టీయు అంతర్ కళాశాలల
క్రీడాపోటీలు ప్రారంభం
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 4: క్రీడల వల్ల క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని జెఎన్టీయు అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొ. కె పద్మరాజు అన్నారు. స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జెఎన్టీయు- కాకినాడ అంతర్ కళాశాలల క్రీడాపోటీలు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. జెఎన్టీయు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ సెక్రటరీ జి శ్యాంకుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు పోటీపడి విజయం సాధించాలన్నారు. ఈ పోటీల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి 29 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఖోఖో, కబాడీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో 900 మంది క్రీడాకారులు వచ్చారు. హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఒకే భవనానికి
రెండుసార్లు ప్రారంభోత్సవం!
తిరువూరు, ఫిబ్రవరి 4: తిరువూరులోని స్ర్తిశక్తి భవనానికి రెండవ సారి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గురువారం ప్రారంభించారు. స్ధానిక ఎమ్మార్సి భవనం ఎదురుగా స్ర్తిశక్తి భవనం నిర్మించేందుకు అప్పటి ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పర్యవేక్షణలో మంత్రి కె పార్ధసారధి సమక్షంలో 25 లక్షల రూపాయల ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించనున్న భవనానికి 2011 సెప్టెంబర్ 23న అప్పటి మంత్రి గల్లా అరుణకుమారి శంఖుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తరువాత 2014 ఫిబ్రవరి 28న నాటి ఎమ్మెల్యే పద్మజ్యోతి ఈభవనానికి ప్రారంభోత్సవం చేశారు. తిరిగి అదే భవనాన్ని గురువారం ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రారంభించారు.