కృష్ణ

ఇక ఫైల్స్ క్లియరెన్స్‌లో శాఖలవారీగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఫైల్స్ క్లియర్ చేసే విధానంలో జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత్వం, వేగవంతమైన పనితీరును చూపాల్సి వుందని స్పష్టంగా తెలియజేశారు. ఫైల్స్ క్లియర్ చెయ్యడంలో శాఖల వారీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు ఎ స్థానిక సబ్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని తెలిపారు. జిల్లాలో 81 కార్యాలయాల ఫైల్స్‌ను ఈ ఆఫీస్ ద్వారా నిర్వహణ చేస్తున్నామని, 49 వేల పైగా ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రెవెన్యూకు చెందినవి 29900 పైగా ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బాబు ఏ వివరాలు తెలుపుతూ, మొత్తం 23 వేల మంది పనిచేస్తున్నారని, జిల్లాలో గ్రామస్థాయిలో పూర్తి పనిదినాల కల్పించడంలో సర్పంచుల సమన్వయంతో పనిచేయిస్తాం. చాలా ఫీల్స్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటి భర్తీకి చెందిన ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ బాబు ఎ వివరించారు.
గ్రీవియాన్స్ పెండింగ్ వచ్చే 10 రోజుల్లో తప్పనిసరిగా క్లియర్ చెయ్యాలని అని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. తీసుకున్న అడ్వాన్సులు పూర్తిస్థాయిలో క్లియర్ చేసి నివేదికను అందించాలని ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. హౌసింగ్ కేటాయింపులలో దేశంలో 2.25 లక్షలు టార్గెట్ మంజూరు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌కు 1.93 లక్షలు ఇవ్వడం జరిగిందని సిఎస్ తెలిపారు. ఈ లక్ష్యాలు 100 శాతం డిజిపి కంటే ఎక్కువ అని తెలిపారు. లవ్ అగర్వాల్ వివరాలు తెలుపుతూ శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు, కడప తదితర జిల్లాలు అధికారులు అందజెయ్యాలని తెలిపారు. కృష్ణా కలెక్టర్ 11 కేసులకు చెందిన 3 వేల గృహాలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా వచ్చే వారం నాటికి ప్రతిరోజు 60 వేల పనిదినాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ బాబు ఎ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, ట్రైనీ కలెక్టర్ సలోని సుడాన్, డిఆర్ పి.రంగయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బీసీలు సహృదయంతో సహకరించాలి
* తెలంగాణ కాపు సంఘం అధ్యక్షులు డా. శ్రీనాథ్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 6: కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చే విషయంలో బీసీలంతా సహృదయంతో సహకరించాలని తెలంగాణ రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డా. బూరగడ్డ శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా కాపులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయ సహకారాలు అందక కాపు యువత అన్నిరంగాల్లో రాణించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ తమ ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేరుస్తామనప్పుడు వ్యతిరేకించని బిసి నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బిసిలు ఏవిధంగానైతే రిజర్వేషన్ల శాతం పెంపునకు సహకరించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాపు యువత చేస్తున్న ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రోద్బలంతో కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇటీవల తునిలో జరిగిన ఘటనలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాయన్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డా. శ్రీనాథ్ డిమాండ్ చేశారు.
కాపు నేతల దీక్ష భగ్నం
అవనిగడ్డ, ఫిబ్రవరి 6: స్థానిక టిటిడి కల్యాణ మండపం వద్ద శనివారం ఉదయం కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రిలే దీక్షలు చేస్తున్న ఐదుగురు కాపు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లపర్తి గోపాలకృష్ణ, రాజనాల బాలాజీ, సామర్ల సుమంత్, ఐ వెంకటేష్, పి శ్రీనివాసరావు దీక్షలో ఉండగా సెక్షన్ 30 ప్రకారం దీక్ష చేయడానికి వీల్లేదని ఎస్‌ఐ వెంకట్‌కుమార్ భగ్నం చేశారు. వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈవిషయం తెలుసుకున్న కాపునాడు కార్యకర్తలు అప్పికట్ల సోములు, బాడిగ నాంచారయ్య, తదితరులు స్టేషన్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే తాము గాంధీజీ సిద్ధాంతాల మేరకు దీక్ష చేస్తున్నామని, తామేమీ విధ్వంసాలు చేయటం లేదని స్పష్టం చేశారు. కేవలం శాంతియుతంగా ఆందోళన చేయమని తమ నాయకుని నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఎ వెంకటస్వామి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కాపు కార్యకర్తలు సమావేశమై శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయటం తగదని, ఈవిషయంలో తమకు సహకరించాలని డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషాను కలిసి కోరారు. కాగా సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఏవిధమైన సభలు, దీక్షలు, ప్రదర్శనలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
లక్ష్మీపురంలో..
కృత్తివెన్ను : ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా లక్ష్మీపురం రంగాబొమ్మ సెంటరులో కాపు నేతలు శనివారం నిర్వహించిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టెంట్, కుర్చీలను తీసివేశారు. అయినా కాపు నాయకులు ఎండను సైతం లెక్కచేయకుండా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
21 మంది అరెస్టు
నాగాయలంక : కాపు రిజర్వేషన్ సాధనకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఇక్కడ పలువురు కాపు నేతలు శనివారం దీక్ష చేపట్టారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు దిడ్ల వీరరాఘవు నాయకత్వంలో స్థానిక కాపు నాయకులు బీసాబత్తిన ప్రసాద్, నంద్యాల వెంకట కోటేశ్వరరావు, విరాటి వెంకయ్య, తోట రాంబాబుతో సహా 21మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎఎస్‌ఐ రత్తయ్య తెలిపారు. భావదేవరపల్లిలో కూడా కాపు దీక్ష చేపట్టిన 10 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని కూడా వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎఎస్‌ఐ తెలిపారు.
కలిదిండిలో..
కలిదిండి : కాపులను బిసి జాబితాలో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా కలిదిండి, కోరుకొల్లు కాపు నేతలు శనివారం దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరే వరకు దీక్షలను శాంతియుతంగా చేస్తామన్నారు. దీక్షలో పేకేటి వివేకానంద్, రాజనాల శ్రీనివాసరావు, నల్లగోపుల వెంకటరత్నం, కోర్టు శ్రీను, చక్కా శ్రీను, నల్లగోపుల చలపతిరావు, బుజ్జి, చిట్టూరి రంగారావు, భోగేశ్వరరావు, పవన్ కళ్యాణ అభిమాని కేసిరెడ్డి వెంకట బలరాం, తదితరులు పాల్గొన్నారు.