కృష్ణ

నేటి నుంచి మేరీమాత ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 8: తొమ్మిది రోజులుగా గుణదల కొండపై జరుగుతున్న గుణదలమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు సోమవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఆఖరిరోజు ప్రార్థనలకు బిషప్ జోసఫ్ రాజారావు, నాగాయలంక విచారణ కర్తలు ఫాదర్ బంటుమిల్లి యోహాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫాదర్ యోహాన్ భక్తులకు సందేశమిస్తూ మరియమాత భక్తులను తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ తనను ఆశ్రయించువారి మనవులను ఆలాకిస్తూ తన కుమారుని ఆనుగ్రహాలను అందరికి అందిస్తున్నారని తెలిపారు. అనంతరం పుణ్యక్షేత్రం ప్రధాన దేవాలయం నుండి ‘దివ్యసత్ప్రసాద ఆరాధనతో బిషప్ జోసఫ్ రాజారావు, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితర గురువులు కొండపైకి చేరుకున్నారు. కొండపై ఫాదర్ యోహాను తదితర గురువులు సమిష్టి దివ్యపూజాబలి సమర్పించారు. చివరి రోజు నవదిన ప్రార్థనలకు గొల్లపూడి, జోజినగర్, గుంటుపల్లి, కొండపల్లి తదితర విచారణల నుండి వచ్చిన భక్తులు జపమాల ధ్యానంతో కొండపైకి చేరుకొని నిరుపేదల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
7 గంటలకు బిషప్‌చే ఉత్సవాలు ప్రారంభం
ఈనెల 9,10,11 తేదిలలో మూడు రోజులపాటు జరిగే గుణదలమాత మహోత్సవాలను మంగళవారం ఉదయం 7 గంటలకు గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో బిషప్ జోసఫ్ రాజారావు, రెక్టర్ చిన్నప్ప, డైరెక్టర్ ఫాదర్ మువ్వలప్రసాద్ తదితర గురువుల సమిష్టి దివ్యపూజాబలితో లాఛనంగా ప్రారంభిస్తారు
ఉత్సవాలకు సర్వం సిద్ధం : డైరెక్టర్ మువ్వలప్రసాద్
నవ్యాంధ్రప్రదేశ్‌లో జరగనున్న మూడు రోజుల గుణదలమాత మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ మువ్వలప్రసాద్ తెలిపారు. ఈ మూడు రోజులు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన దివ్యపూజాబలిని పీఠాధిపతులు, గురువులు సమర్పిస్తారన్నారు. తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు.

పోలీసుల కళ్లుగప్పి లొంగుబాటు యత్నాల్లో చెన్నుపాటి శ్రీను
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నిందితుడు చెన్నుపాటి శ్రీను లొంగుబాటు ప్రయ త్నం మొదలయింది. దాదాపు నెలరోజులకు పైగా అజ్ఞాతంలో గడిపిన శ్రీ ను సోమవారం నగరంలో మెరుపులా మెరిసి మాయమయ్యాడు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన శ్రీను ప్రయత్నం వాయిదా పడింది. మరోవైపు నిందితుడు కోర్టులో లొంగిపోడానికి ముందే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే కనుక జరిగితే శ్రీను అరెస్టును తమ ఖాతాలో వేసుకోవచ్చని ఇటు మాచవరం, మరోవైపు టాస్క్ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. వాస్తవానికి పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నా ఆతర్వాత శ్రీను మనసు మార్చుకుని కోర్టు బాట పట్టినట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న పోలీసులు సోమవారం కోర్టు వద్ద నిఘా వేశారు. అయితే వచ్చినట్టే వచ్చి కనిపించకుండా మాయం కావడంతో నిరాశకు గురయ్యారు. నిందితుడు ప్రస్తుతం నగరంలోనే రహస్యంగా తలదాచుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో చెన్నుపాటి శ్రీను మూడో నిందితుడు. కాల్‌మనీ పేరుతో లైంగిక చర్యలకు పాల్పడిన ఆరోపణలపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు మాచవరం పోలీస్టేషన్‌లో ఏడుగురు నిందితులపై అత్యాచారం, చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. పటమటకు చెందిన కాల్‌మనీ వ్యాపారి యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు (టెక్నికల్) ఎం సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్ నిందితులుగా ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 11న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరోవైపు అసెంబ్లీని సైతం పట్టి కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటివరకు రాము, భవానీశంకర్, సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, రాజేష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం వీరంతా జైలులో రిమాండ్ అనుభవిస్తున్నారు. కాగా చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ళ శ్రీకాంత్ మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. అయితే శ్రీను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కొద్దిరోజుల క్రితం కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సన్నిహితుల సూచన మేరకు తొలుత పోలీసుల వద్ద లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే మాచవరం పోలీసులు గుణదల మేరీమాత ఉత్సవాల్లో నిమగ్నమై ఉన్నందున ఉత్సవాల తర్వాత స్టేషన్‌లో లొంగిపోవచ్చని భావిస్తున్న తరుణంలో వ్యూహాత్మకంగా నగరానికి చేరుకున్న శ్రీను సోమవారం కోర్టు వద్దకు వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్, మాచవరం పోలీసులు కోర్టు వెలుపల నిఘా వేశారు. అయితే శ్రీను తరపున హైకోర్టు న్యాయవాది కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేయగా.. అది మంగళవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. దీంతో వెనుదిరిగిన శ్రీను మంగళవారం మధ్యాహ్నంలోగా కోర్టులో లొంగిపోవచ్చని పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈలోగానే అతన్ని పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న పోలీసులకు శ్రీను కనుక ఆ అవకాశం ఇవ్వకుంటే లొంగిపోయిన తర్వాత రిమాండు నుంచి అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదిలావుండగా శ్రీనుపై ఈ కేసుతో పాటు మరో ఐదు కేసులు ఇప్పటికే పలు పోలీస్టేషన్లలో నమోదైనట్లు తెలిసింది. శ్రీను ఘట్టం పూర్తయితే ఇక పోలీసులు కీలకమైన మరో నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌పై దృష్టి సారించనున్నారు.