కృష్ణ

15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు. సోమవారం విజయవాడ ఎ 1 కనె్వన్షన్ హాల్లో నిర్వహించిన రెండు రోజుల కలెక్టర్ల లైవ్ టెలీకాస్ట్ చేయగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లైవ్ టెలీకాస్ట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సగటు వృద్ధి రేటు 7.3కాగా ఆంధ్రప్రదేశ్ 10.5శాతం వృద్ధి రేటు సాధించటం అభినందనీయమన్నారు. ఇ-పోస్ అమలుకు లక్ష ట్యాబ్‌లు ఇచ్చామని, వాటిని ఎంత మంది వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. నైపుణ్య అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని, ఈ అంశానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సంస్థ అక్రిడేషన్ పొందేలా అభివృద్ధి జరగాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం, గ్రోత్ రేటు, సంపద సృష్టి తదితర అంశాలలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలన్నారు. జన్మభూమిలో అర్జీదారుల అర్హత జాబితాలు తయారు చేయాలన్నారు. మీకోసం దరఖాస్తులను తగ్గించాలన్నారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న ఫైల్స్‌ను ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. ఈ ఏడాది అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి శాఖకు నెలవారి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ చెరుకూరి రంగయ్య, బందరు ఆర్డీవో సాయిబాబు, కలెక్టర్ ఎఓ సీతారామ్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ, డిపిఓ కృష్ణకుమారి, ట్రజరీ డిడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.