కృష్ణ

హుండీలు పగులగొట్టి సొమ్ము చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి: ఆగిరిపల్లి గ్రామంలోని దుగ్గిరాల బాలరావమ్మ గుడి వద్ద సింగన్నగూడెం బస్‌స్టాప్ వద్దగల షిరిడిసాయిబాబు జ్ఞానమందిరంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించి హుండీలు పగులగొట్టారు. విరరాల్లోకి వెళితే సోభనాపురం రోడ్డులోని దుగ్గిరాల బాలరావమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి బయటగల నాలుగు హుండీలను దొంగలు పగులగొట్టి చెలాచెదురు చేశారు. అదే రోజు రాత్రి విజయవాడ రోడ్డులోగల షిరిడి సాయిబాబా జ్ఞానమందిరం వద్ద ఒక హుండీని దొంగలు పగులగొట్టారు. దుగ్గిరాల బాలరావమ్మ కమిటీ సభ్యులు, షిరిడిసాయిబాబా కమిటీ సభ్యులు స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసువారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి చుట్టు పక్కల వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. అయితే కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25న సాయి జ్ఞాన మందిరం, 26న దుగ్గిరాల బాలరావమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమంలో జరిగిందన్నారు. లెక్కింపు జరగకపోతే పెద్ద మొత్తంలో సొమ్ము చోరీకి గురయ్యేదని వారు తెలిపారు.

కల్తీమద్యం బాధితుడు శంకర్ మృతి
గన్నవరం, ఫిబ్రవరి 29: విజయవాడలో కల్తీ మద్యం సేవించి గత 84 రోజులుగా అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తి సోమవారం తుది శ్వాస విడిచిన వైనమిది. గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ ఆసుపత్రిలో గత డిసెంబర్ 7న చికిత్స నిమిత్తం పోలీసులు చేర్చారు. తమిళనాడుకు చెందిన శంకర్ (50) విజయవాడలో జరిగిన కల్తీ మద్యం కేసులో అపస్మారక స్థితిలో ఉండగా చిన్నఅవుటపల్లి ఆసుపత్రిలో ఉన్నత వైద్యం కోసం చేర్చారు. అతడు విజయవాడ అమెరికన్ ఆసుపత్రి వద్ద క్యాంటిన్‌లో పనిచేసేవాడని పోలీసుల భోగట్టా. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. 84 రోజులు మృత్యువుతో పోరాడి, తుదకు సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇతడిని ఆసుపత్రిలో పరామర్శించారు.
గన్నవరంలో గర్భిణీ ఆత్మహత్య
గన్నవరం, ఫిబ్రవరి 29: భర్త పెట్టే వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గన్నవరంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం గన్నవరం రామ్‌నగర్‌కు చెందిన మువ్వా రేఖారాణి(25) ఆమె భర్త ఫణీంద్ర పెట్టే చిత్రహింసలు భరించలేక ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి గొచ్చిపాటి ఉమామహేశ్వరి సోమవారం ఉదయం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు గన్నవరం ఎస్‌ఐ అబ్దుల్ మున్నీర్ కేసు నమోదు చేసి, గన్నవరం తహశీల్దార్ ఎం.మాధురి సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు 3 నెలల గర్భిణీ అని ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిన్నఅవుటపల్లిలో ఎంబిబిఎస్ విద్యార్థి ఆత్మహత్య
గన్నవరం, ఫిబ్రవరి 29: గన్నవరం మండల చిన్నఅవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థి హరిహరన్(21) మనస్థాపానికి గురై హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది. గన్నవరం పోలీసుల కథనం ప్రకారం మెరిట్ విద్యార్థి హరిహరన్‌కు పరీక్ష పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. మృతుడు హరిహరన్ స్వగ్రామం కాకినాడ, అతని తల్లిదండ్రులు రాక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు ఎస్‌ఐ అబ్దుల్ మున్నీర్ తెలిపారు.
నేడు టిడిపి రాష్టస్థ్రాయి విస్తృత సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 29: తెలుగుదేశం పార్టీ రాష్టస్థ్రాయి విస్తృత సమావేశం మంగళవారం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఏ కనె్వన్షన్‌లో జరగనుంది. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ద్వారా ఇటీవల భారీగా అందజేసిన రుణాలు, అన్నింటికీ మించి వైకాపా నుంచి తెలుగుదేశంలోకి సాగుతున్న వలసలు, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. వలసలపై స్థానిక కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారో అనే విషయంపై ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల వారీగా అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. త్వరతగతిన సభ్యత్వ నమోదును పూర్తిచేసే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* జిల్లాలో 152 పరీక్ష కేంద్రాలు
* 1.28 లక్షల మంది విద్యార్థులు
* 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 29: మార్చి 2 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ప్రాంతీయ మండలి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశ్నపత్రాలను ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. ప్రైవేట్, కార్పొరేట్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం రాజారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 152 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం లక్షా 28వేల 929 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 65,404 మంది వుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 63,525 మంది ఉన్నారు.