కృష్ణ

పాలకుల భూదందాను సాగనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9న భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ కోట కల్యాణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సారవంతమైన భూములను బలవంతంగా లాక్కోవటాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వ్యవహరించాలన్నారు. వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, కౌలు రైతులకు అన్ని ప్యాకేజీలు అమలుచేయాలని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 9న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల సాగుభూమిని బలవంతంగా లాక్కుని భూ బ్యాంకును ఏర్పాటు చేయాలని కారుచౌకగా కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం నదీ పరీవాహక ప్రాంతాల్లోని భూములను రైతుల నుండి లాక్కుని క్లబ్‌లు, పర్యాటకం పేరుతో 1130 ఎకరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైలవరం, నూజివీడు, తిరువూరు ప్రాంతాల్లోని 12 మండలాలలో 15వేల ఎకరాలను, బందరు పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు 34వేల ఎకరాలు, కోడూరు, నాగాయలంక మండలాలలో 10వేల ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ భూముల్లో పేదలు, దళితులు, సాగుదారులుగా ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ‘చలో విజయవాడ’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి రావూరి రామారావు, బుచ్చయ్య, సుబ్బారావు, పరమేశ్వరరావు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

వరకట్న వేధింపులకు గృహిణి బలి
చల్లపల్లి, మార్చి 2: అదనపు కట్నం కోసమని వేధింపులకు ఓ యువతి బలైంది. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోదని, మరింత కట్నం తీసుకురమ్మని భర్త పెడుతున్న వేధింపులు భరించలేక పరిశే మహేశ్వరి(23) బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానిక నారాయణరావు నగర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అద్దంకి శ్రీనివాసరావు - నాంచారమ్మల కుమార్తె మహేశ్వరిని 2011లో చల్లపల్లికి చెందిన పరిసే బాలయ్య - వెంకటేశ్వరమ్మల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల బాలుడు, తొమ్మిది నెలల పాప ఉంది. బుధవారం ఉదయం దంపతులు గొడవపడ్డారు. తర్వాత మహేశ్వరి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన భర్త తలుపుల పగులకొట్టి కొన ఊపిరితో ఉన్న మహేశ్వరిని హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే మహేశ్వరి మార్గంమధ్యలోనే మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. తన కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు చల్లపల్లి చేరుకున్నారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నాడని మహేశ్వరి తండ్రి శ్రీనివాసరావు ఆరోపించాడు. తన కుమార్తె దగ్గర ఉన్న బంగారం మొత్తం అల్లుడు శ్రీనివాసరావు తాకట్టు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ వైవి రమణ, ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.