కృష్ణ

వేదాద్రి స్వామివారి సేవలో సినీ హీరో శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: సినీ హీరో శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదాద్రిని సందర్శించి శ్రీ యోగానంద లక్ష్మీనర్శింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీరాం వరప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు, స్వామి చిత్రపటాలు అందజేశారు. అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
సాంకేతిక పోటీల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
గుడ్లవల్లేరు, మార్చి 6: రాష్టస్థ్రాయి సాంకేతిక పోటీల్లో స్థానిక ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చాలని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వి రామాంజనేయులు ఆదివారం తెలిపారు. ఈ నెల 4, 5తేదీల్లో నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్ణాంధ్ర పాలిఫెస్ట్-2016 పేరిట రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు రాష్టస్థ్రాయిలో వివిధ సాంకేతిక అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. మెకానికల్ విభాగంలో నిర్వహించిన సాంకేతిక అధ్యయన పత్రాల సదస్సులో టి రాహుల్, వి సికిందర్ ద్వయం అడ్వాన్స్‌డ్ కార్బన్ మాగ్నెటిక్ అంశంపై అధ్యయన పత్రం సమర్పించి ప్రథమ బహుమతి సాధించారు. టెక్నికల్ క్విజ్‌లో ఎస్ గణేష్‌కు ప్రథమ, పి రాహుల్‌కు ద్వితీయ, కె శ్రీనివాస్ యాదవ్‌కు తృతీయ బహుమతి వచ్చాయని ప్రిన్సిపాల్ తెలిపారు. విజేతలను, శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను యాజమాన్యం అభినందించింది.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
నాగాయలంక, మార్చి 6: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఆనందభరితంగా జరిగింది. పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రేమాల సుబ్బారావు, బొర్రా వెంకటేశ్వరరావు, ఇతర సభ్యుల నేతృత్వంలో జరిగిన సమ్మేళనంలో పలువురిని సత్కరించారు. ఈసందర్భంగా రేమాల మాట్లాడుతూ నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల స్థాపించి 70సంవత్సరాలు పూర్తయ్యిందని అప్పటి నుంచి విద్యను అభ్యసించిన వారంతా కలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈదల రవీంద్రప్రసాద్, దుట్టా వీరాస్వామి, కె శ్రీ్ధరరావు, తదితరులతో పాటు పూర్వ విద్యార్థులు ధర్మ వెంకటస్వామి, తలశిల సీతారామయ్య, తలశిల వెంకటేశ్వరరావు, సబ్బినేని వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యంను సత్కరించారు.

బాలల సంక్షేమ సంస్థలను ప్రోత్సహించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 6: బాలల సంక్షేమం, రక్షణ, పునరావాసం కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సేవలను గుర్తించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ, బాలల, న్యాయ సంస్కరణల సేవల జాయింట్ డైరెక్టర్ బిడివి ప్రసాద్‌మూర్తి పేర్కొన్నారు. చట్టాలతో విబేధించిన బాలలకు మరింత మెరుగైన సేవలు అందాలంటే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. స్థానిక స్వర్ణ ప్యాలెస్ సమావేశమందిరంలో ఆదివారం బాలల సంక్షేమం, రక్షణ రంగాలలో కృషి చేసిన వ్యక్తులను సంస్థలు గుర్తించి 2015కిగాను ‘బాల సేవక్ అవార్డ్’లను హెల్ప్ సంస్థ బాలల సంక్షేమం, సంస్కరణల సేవల ప్రభుత్వ శాఖ సంయుక్తంగా ప్రదానం చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలల సంక్షేమం, సంస్కరణ సేవల జాయింట్ డైరెక్టర్ బిడివి ప్రసాద్ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ప్రతి ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రశంసలు, ప్రోత్సాహాల ద్వారా వ్యక్తులలో స