కృష్ణ

దూరప్రాంత ఇసుక క్వారీల అనుమతితో పేటలో ఇసుక మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: ప్రభుత్వం ఉచిత ఇసుక అంటే జనాలు సంతోషపడ్డారని, కానీ ఎక్కడో విజయవాడ పరిసరాల్లోని ఏడు క్వారీలకు అనుమతి ఇవ్వడంతో జగ్గయ్యపేట ఇసుక కొనాలంటే వినియోగదారులకు మరింత భారంగా మారిందని మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుతో సహా నేతలు అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో గతంలోనూ మూడు క్వారీలకు టెండర్లు పిలిచినా వాటికి సాంకేతిక కారణాలతో అనుమతులు ఇవ్వలేదని, విజయవాడ నుండి ఇసుక తెచ్చుకోవడం అంటే ఒకొక్క ట్రాక్టర్‌కు రూ.5 నుండి 6వేలు ఖర్చు అవుతుందన్నారు. నియోజకవర్గంలో క్వారీ ఉంటే ట్రాక్టర్ రూ.3వేలకు లభించేదని, ఉచిత ఇసుక అంటే సుమారు 1200లోపు వస్తుందని సంతోషపడ్డారని, కానీ వారి సంతోషాన్ని వమ్ము చేస్తూ విజయవాడ పరిసరాల్లో ఇచ్చిన క్వారీలతో రెండు టోల్‌గేటులు దాటుకొని జగ్గయ్యపేట తీసుకురావడం పెనుభారంగా మారుతుందన్నారు. ప్రభుత్వ విధానం ఈ ప్రాంతవాసులకు పెనం నుండి పొయ్యిలో పడ్డట్లుగా మారిందని, కేవలం బడా పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందని విజయవాడ సమీపంలో క్వారీలకు అనుమతులు ఇచ్చారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని క్వారీలకు అనుమతి ఇస్తే ఇసుక చౌకగా వస్తుంది కానీ ఉచితం అంటూ వందల కిలో మీటర్ల దూరంలో అనుమతి ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ విధానాన్ని సమీక్షించుకొని నియోజకవర్గంలోని క్వారీలకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఆందోళన చేపడతామని చైర్మన్ తన్నీరు హెచ్చరించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, నేతలు చింకా వీరాంజనేయులు, ఎంవి చలం, నంబూరి రవి, షేక్ రఫీ, శేషం ప్రసాద్ పాల్గొన్నారు.

సబ్సిడీ ఎరువులు సద్వినియోగం చేసుకోవాలి
కంకిపాడు, మార్చి 10: రైతులకు సబ్సిడీపై ఎరువులు అందజేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధార్ బేస్‌డ్ ఎరువుల పంపిణీ కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్‌లో నిర్వహిస్తున్న ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాబు ఎ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల విక్రయ కేంద్రం నిర్వహణపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రైతులకు సబ్సిడీపై ఎరువులను అందజేసేందుకు జిల్లాలో 20 ఆధార్ బేస్‌డ్ ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఆధార్ బేస్‌డ్ విక్రయ కేంద్రాల ద్వారా ఎరువులను తక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలియచేయకపోవటం వలన రైతులు ప్రభుత్వ విక్రయ కేంద్రాలలో ఎరువుల అమ్మకాలు సక్రమంగా జరగటం లేదని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల స్టాకు, అమ్మకం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ జరగాల్సినప్పటికీ ఇ-పోస్ యంత్రం ద్వారా నమోదు కాకపోవటం పట్ల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంకిపాడు వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లోని ఎరువుల విక్రయ కేంద్రంలో ఇంటర్ ఆఫరబుల్ మిషన్ (ఇ-పోస్) ద్వారా ఎరువులను జిల్లా కలెక్టర్ విక్రయించారు. కంకిపాడుకు చెందిన మధుసూధనరావు, మాటూరు కోటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు రైతులకు ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం ఇ-పోస్ విధానం ద్వారా రైతుల వేలిముద్రలతో ఆధార్ నెంబర్ అనుసంధానం చేసి రైతు వివరాలను నమోదు చేసుకొని ఎరువులను జిల్లా కలెక్టర్ విక్రయించారు. అయితే ఆధార్ నెంబర్ సరిచూసిన రైతులకు వారికి ఉన్న భూమి కంటే అదనంగా భూమి ఉన్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించిన పూర్తి భూమి వివరాలతో మరొకసారి ఆధార్ అనుసంధానాన్ని సరిచేయాలని తహశీల్దార్ రోజాను కలెక్టర్ ఆదేశించారు. విక్రయ కేంద్రాలలో ఎరువుల స్టాకు వివరాలు, అమ్మకాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, కేంద్రాలు వారిగా రోజువారీ విక్రయాల వివరాలు, స్టాకు నిల్వలు తదితర వివరాలు ఇ-పోస్ మిషన్లో డిస్‌ప్లే జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సాంకేతిక సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఎరువుల విక్రయ కేంద్రాలను పరివీలించి రైతులు ఎరువులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలలని వ్యవసాయ అధికారి బాలునాయక్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి శర్మకు ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కార్యక్రమంలో కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కె.సుబ్రహ్మణ్యం, మండల వ్యవసాయ అధికారిణి అనితా భాను, తహశీల్దార్ రోజా తదితరులు ఉన్నారు.

‘దుర్గమ్మ’ సాక్షిగా కోల్డ్‌వార్
విజయవాడ (క్రైం), మార్చి 9: దుర్గగుడిపై అమ్మవారి సాక్షిగా రెండు వర్గాల నడుమ కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇటు కార్యనిర్వహణాధికారి వర్గానికి.. మరోవైపు బ్రాహ్మణ, అర్చక సంఘాల మధ్య చాలాకాలంగా నెలకొన్న విభేదాలు క్రమేణా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇఓ వేధింపులకు పాల్పడుతున్నట్లు అర్చక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మానస్తాపానికి గురైన ఓ అర్చకుడు అస్వస్థతతో ఆస్పత్రి పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సదరు అర్చకునిపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో మందలించడం మాత్రమే జరిగిందంటూ ఇఓ వర్గం చెబుతోంది. మొత్తం మీద తాజా పరిణామాల నేపధ్యంలో అర్చక, బ్రాహ్మణ వర్గం బుధవారం నగర పోలీసు కమిషనర్ దామోదర్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. మరోవైపు మొత్తం వ్యవహారంపై విచారణాధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఇంద్రకీలాద్రిపై కలకలం రేపుతున్న రెండు వర్గాల నడుమ విభేదాలు పరిశీలిస్తే.. భిన్న వాదనలతో ప్రచారం జోరందుకుంది. గుడిపై విధులు నిర్వహిస్తున్న మంగళంపల్లి సుబ్బారావు (32) ప్రస్తుతం అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వర్గం చెబుతోంది. కాగా సుబ్బారావు తండ్రి మరణానంతరం గుడిపై ఉద్యోగం వచ్చింది. 20రూపాయల క్యూలైన్‌లో భక్తులకు శఠగోపం పెట్టే విధులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గుడి ఇఓ తనిఖీలు చేసిన సమయంలో విధుల్లో లేనందున అతన్ని అవుట్‌పోస్టుకు మార్చి 15వేల రూపాయలు జరిమానా విధించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయమై అర్చకుడు ఇఓను కలిసేందుకు ఇంటికెళ్లగా అక్కడ జరిగిన సంభాషణలు వాగ్వివాదానికి దారి తీయడంతో అటెంటర్ నెట్టేశాడని, దీంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అర్చకుడు సుబ్బారావు భక్తుల నుంచి వచ్చే దక్షిణాలు జేబులో వేసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీంతో ఇఓ మందలించడం మాత్రమే జరిగినట్లు ఇఓ వర్గం ప్రచారంగా ఉంది. ఈ కోల్డ్‌వార్ నేపధ్యంలో ఇఓకు వ్యతిరేకంగా అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆస్పత్రిలో ఉన్న సుబ్బారావు భార్య దుర్గతో కలిసి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఇఓ ఉద్ధేశ పూర్వకంగానే అర్చకుల పట్ల వేధింపులకు పాల్పడుతున్నట్లు వారు సీపి దృష్టికి తీసుకువచ్చారు. దీని కారణంగానే సుబ్బారావు ఆస్పత్రిపాలైనట్లు చెబుతున్నారు. ఈమేరకు సీపికి వినతిపత్రం సమర్పించారు. ఇదిలావుండగా కలకలం రేపుతున్న దుర్గగుడి వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్‌ను విచారణాధికారిగా నియమించడంతో ఆయన గురువారం నగరానికి చేరుకుని విచారణ ప్రారంభించనున్నారు.

యనమలకుదురులో
రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు
పెనమలూరు, మార్చి 9: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా యనమలకుదురులో బుధవారం రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాలను ప్రారంభించారు. గ్రామంలోని హోసన్న మందిరం సమీపంలోని మైదానంలో పందాలను ఏర్పాటు చేశారు. శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలకు రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుండి 20 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎడ్ల ప్రదర్శనతోపాటు బుధవారం జూనియర్ విభాగపు ఎడ్ల జతలకు బండ లాగుడు పోటీలను నిర్వహించారు. గురువారం సీనియర్ విభాగపు ఎడ్ల జతలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని దేవస్థానం కమిటీ తెలిపింది.

డంపింగ్ యార్డుపై శ్రద్ధేది?
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 9: ఎన్నికలు గడిచి రెండు సంవత్సరాలు పూర్తయినా సింగ్‌నగర్‌లో చెత్త తరలింపు ఆగలేదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చెత్తను తొలగించి డంపింగ్ యార్డ్ నిర్మాణానికి శాసనసభ్యులు పూనుకోలేదని లూనాసెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో దోనేపూడి శంకర్ అన్నారు. కృష్ణాహోటల్ సెంటర్‌లో జరిగిన సభలో దోనేపూడి శంకర్ ప్రసంగిస్తూ ఇండ్ల పట్టాల సమస్య, ఇండ్ల నిర్మాణంపై నగర వ్యాప్తితంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టటం జరిగిందని అన్నారు. శాసనసభ్యులుగా గెలిచి ప్రజాసమస్యలు మరచి బ్యానర్లు రాయించుకొని ప్రచారం చేసుకోవటం తప్ప స్థానిక ప్రజలకు గోరంతైన సేవ చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప గెలిపించిన ప్రజలకు మేలు చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కారానికి కృషి చేయటం లేదని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని, రకరకాల వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఆ హామీలు అన్ని నేడు మరచాడని విమర్శించారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్న ఒక్క ఉద్యోగం కల్పించలేదని అన్నారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక నగర ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని, ఇళ్ళ సమస్యలు జఠిలమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, నగర కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, కె.వి.్భస్కరరావు, కొట్టు రమణరావు, నక్కా వీరభద్రరావు, నగర మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, స్థానిక శాఖా కార్యదర్శులు కె.పోతినాయుడు, కె.రామరాజు, కె.రమేష్, జాడా పెద్దిరాజు, స్థానిక నాయకులు జి.రాహేలమ్మ, తమ్మిన దుర్గ, డి.రాములు, బి.లోకేష్‌బాబు, శేషు, నర్సమ్మ, కన్నమ్మ, లత, సిపిఎం నాయకులు య.రామరాజు, డి.విష్ణువర్ధన్, డి.రమణ తదితరులు పాల్గొన్నారు.