కృష్ణ

వ్యాయామ, అక్షరాస్యత రాష్ట్రంగా ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్): వ్యాయామ, అక్షరాస్యత, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం వుందని, వ్యాయామ అక్షరాస్యత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఎ1 కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వ్యాయామ, అక్షరాస్యత, క్రీడలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఆనందమయ సూచికలో దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యాయామ విద్య శిక్షణ ప్రాథమిక పాఠశాల దశ నుండి ప్రతి చిన్నారికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాయామ విద్యకు అవసరమైన వౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు 5గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, క్రీడాశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు వుంటారని, ఏప్రిల్ నెలలోగా వ్యాయామ విద్యా పాలసీ తయారుచేయాలని, మే నెలలోగా వౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలని, జూన్ నెలలో క్యాలెండర్ రూపకల్పన జరగాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతీయ కేంద్రాల్లో వివిధ క్రీడలకు సంబంధించి మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రాల్లో వున్న ఆట స్థలాలను అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు వివిధ క్రీడాంశాల్లో సంవత్సరం పొడవునా పోటీలు నిర్వహించేందుకు చర్యలు రూపొందిస్తామన్నారు. కోచ్‌లు, పిఇటిలు, పిడిల అవసరం ఎంతైనా వుందని, అవసరమైతే పాఠశాలలో టీచర్స్‌ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. డబ్బు కన్నా సంతోషం ఎంతో ముఖ్యమన్నారు. 2029 నాటికి దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా రూపుదిద్దడమే లక్ష్యమన్నారు. 24 గంటలు చదువు వల్ల క్రీడలు తగ్గాయన్నారు. వ్యాయామ విద్యను పాఠ్యాంశంగా చేర్చుకుందామని, ఇప్పటి నుండే గొంతెమ్మ కోర్కెలు కోరవద్దన్నారు. సాయంత్రానికి క్రీడా మైదానాల్లో వుండాలి కానీ, పబ్, బార్‌లలో కాదని అందరినీ నవ్వించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తిరోగమన దశలో వుందని, గతంలో తాము కుటుంబ సంక్షేమ ప్రోత్సాహంపై తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా వుండేందుకు ఆటలు, వ్యాయామం అవసరమన్నారు.ప్రకృతి సిద్ధమైన ఆట స్థలాల్లో వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆటలు, వ్యాయామం ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రులు పాలవడం జరగదన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంతం మధ్యమధ్యలో జోక్‌లు వేస్తూ నవ్వుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అంతకుముందు క్రీడాశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యాయామ విద్య పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ప్రతి పౌరుడు ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలంటే అది క్రీడల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. గత సంవత్సరం రూ.30 కోట్లు వున్న క్రీడా బడ్జెట్‌ను రూ.230 కోట్లకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం బిసిసిఐ సెలక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ భారత క్రికెటర్ ఎంఎస్‌కె ప్రసాద్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.పుల్లారావు, కొల్లు రవీంద్ర, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి పి.గోపీచంద్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రమణ్యం, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, మేనేజింగ్ డైరక్టర్ అండ్ వైస్ చైర్మన్ జి.రేఖారాణి, కలెక్టర్ బాబు.ఎ, కరీముల్లారావు, రవీంద్రబాబు, ఒలింపిక్ సంఘ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, శాప్ శిక్షకులు, శాప్ బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.