కృష్ణ

విజయవాడ కేథలిక్ డయోసిస్ నూతన బిషప్‌గా జోసెఫ్ రాజారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 19: సెయింట్ వౌంట్ ఫోర్టు సొసైటీ ఆఫ్ మేరి సభకు చెందిన ఫాదర్ తెలగతోటి జోసెఫ్ రాజారావును పోప్ ఫ్రాన్సిస్ విజయవాడ కతోలిక పీఠానికి నూతన బిషప్‌గా నియమించారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ కతోలిక పీఠం అపోస్తోలిక పాలనాధికారి బిషప్ గోవిందు జోజి పటమటలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాటికన్ నుండి పోప్ ఫ్రాన్సిస్ పంపిన సీల్డ్ కవర్‌లో బిషప్ నియామక పత్రంలోని వివరాలను గురువులు, సిస్టర్స్, క్రైస్తవుల ఆనందోత్సాహాల మధ్య ప్రకటించారు. విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్‌గా నియమితులైన జోసెఫ్ రాజారావు ప్రస్తుతం బెంగుళూరులోని సెయింట్ వౌంట్ ఫోర్టు ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా కొనసాగుతున్నారు. జూన్ 7, 1980న ఆయన గురువుగా (్ఫదర్) అభిషిక్తులయ్యారు. కృష్ణా జిల్లా నూజివీడులోని సెయింట్ అంబ్రోస్ సెమినరీలో గురువిద్యలో ప్రవేశించారు. ఆంధ్ర లయోలా కళాశాలలో బిఏ పట్టా పొందారు. బెంగుళూరులోని సెయింట్ పీటర్స్ పేపల్ సెమినరీలో ఫిలాసఫీ విద్యను, బెంగుళూరు ధర్మారం విద్యాక్షేత్రంలో బైబిల్ వేదాంతం విద్యను అభ్యసించారు. రోమ్‌నగరంలో గురు ఉన్నత విద్యను అభ్యసించారు. మార్చి 8, 1952లో తెలగతోట ప్రభుదాస్ - కమలమ్మ పుణ్యదంపతులకు పెద్ద అవుటపల్లిలో జోసెఫ్ రాజారావు జన్మించారు. బిషప్ స్వగ్రామం కంకిపాడు సమీపంలోని మానికికొండ కావటంతో ఆ ఊరివాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం మానికొండ గ్రామం ఉప్పులూరు ఆర్‌సిఎం విచారణ పరిధిలో వుంది. బిషప్ రాజారావు నియామకం పట్ల విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్ ఎం చిన్నప్ప, ఛాన్స్‌లర్ జె జాన్‌రాజు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పొక్రెయిటర్ ఫార్ ఎం గాబ్రియేలు, విజయవాడ కతోలిక పీఠం కన్స్‌లేటర్స్, ఫాదర్స్, మఠకన్యలు, విజయవాడ కతోలిక పీఠం గృహస్థ క్రైస్తవులు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షం ప్రకటించారు.
నాట్యక్షేత్రం అభివృద్ధికి మేము సైతం అన్న పాశ్చాత్య విద్యార్థులు
కూచిపూడి, డిసెంబర్ 19: అభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యార్థులు అనుభవిస్తున్న వౌలిక సదుపాయాలను నాట్య క్షేత్రం కూచిపూడిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్పించేందుకు అమెరికాలో 200 మంది విద్యార్థులు నిరంతరం కృషి చేస్తున్నామని సిలికానాంధ్ర అమెరికా మనబడి విద్యార్థిని కొండిపర్తి అనూష తెలిపారు. తన తల్లిదండ్రులు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు కొండిపర్తి దిలీప్ భారతిలతో కలిసి కూచిపూడి విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తమ సంస్థ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని తిలకించి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా స్థానిక సిద్ధేంద్ర జిల్లా పరిషత్ ఓరియంటల్ పాఠశాలలో జరిగిన సుందరీకరణ పట్ల సంతృప్తి చెందారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచీకరణతో జగమంతా ఒకే కుటుంబం కావటంతో సిలికానాంధ్ర 35 దేశాలకు 700 కుటుంబాలు సభ్యులుగా ఉన్నారని దిలీప్ తెలిపారు. ఏడాదికి రూ.32 మిలియన్ డాలర్ల నిధులు కలిగిన నారన్ యాంటీ వైరస్ సంస్థకు భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలు పడుతున్న ఇబ్బందులు తెలియటం లేదన్నారు. మన బడి ద్వారా సిలికానాంధ్ర పాఠశాలలకు వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చి పైలెట్ ప్రాజెక్టుగా నాట్య క్షేత్రాన్ని ఎంపిక చేశామన్నారు. యూనివర్సల్ బ్రదర్ హబ్‌గా బాలురతో పాటు బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇంత వరకు కేవలం ప్రవాసాంధ్రుల నుండి మాత్రమే సేకరించిన విరాళాలను, కల్పించిన అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా తిలకించిన పాశ్చాత్య విద్యార్థులు తాము సైతం అన్ని ముందుకు వస్తున్నారని అనూష తెలిపారు.