కృష్ణ

మరోఆరు రీచ్‌ల ద్వారా ఉచిత ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉచిత ఇసుక పంపిణీలో భాగంగా మరో ఆరు ఇసుక రీచ్‌ల ద్వారా 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అందులో భాగంగా ఇప్పటికే 7 రీచెస్ ద్వారా పంపిణీ ప్రక్రియను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొని రాగలిగామని బాబు.ఎ పేర్కొన్నారు. ఇసుకను అక్రమ మార్గాల్లో తరలించాలని ప్రయత్నిస్తే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రశ్న లేదని కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ఉచిత ఇసుక రవాణాపై విజిలెన్స్‌ను ముమ్మరం చెయ్యడం జరుగుతోందని, అందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక బృందాలతో కూడిన అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు బాబు.ఎ తెలిపారు.
జిల్లాలో కొత్తగా ఆరు రీచెస్ నోటిఫికేషన్ జారీ కోసం కాకినాడలోని జాయింట్ డైరక్టర్‌కు ఇసి, అనుమతులకై శనివారం ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ చెప్పారు. కృష్ణాజిల్లాలో కొత్తగా ఉచిత రీచెస్‌గా కంచికచర్ల మండలం చెవిటికల్లు, నందిగామ మండలంలోని కంచర్ల, చందర్లపాడు మండలంలోని పొక్కునూరు, కసారబాద, వత్సవాయి మండలంలోని అల్లూరుపాడు, పెనుగంచిప్రోలు మండలంలోని శనగపాడు గ్రామాలకు చెందిన ఆరు రీచెస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు.