కృష్ణ

ఏసిబి వలలో మరో అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. స్థానిక వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఎ-సెక్షన్ సూపరింటెండెంటుగా పని చేస్తున్న రంగారావు అదే కార్యాలయంలో ఆఫీసు సబార్డునేట్‌గా పనిచేస్తున్న దివ్యమణి నుండి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దివ్యమణి 2014లో ఆఫీసు సబార్డునేట్‌గా విధుల్లో చేరగా అప్పటి నుండి ఆమెకు రావాల్సిన పేరిక్విటేషన్, ఏరియర్స్‌కు సంబంధించి రంగారావు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. అంతే కాకుండా ఆమెను ఇతరత్రా వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగి వేసారిన దివ్యమణి ఈనెల 22న ఎసిబి అధికారులను ఆశ్రయించింది. ఏసిబి అధికారుల సూచనల మేరకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్ళి రంగారావుకు రూ.10వేలు ఇచ్చింది. అప్పటికే మాటు వేసిన ఎసిబి అధికారులు రంగారావుపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌ఛార్జి ఎసిబి డిఎస్పీ చంద్రవంశం దేవానందశ్యాంతో ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సిఐలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

56 శాతం పెరిగిన విమాన ప్రయాణం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ట్రాఫిక్ గతంలో కంటే 56 శాతం మేర పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. కేంద్ర మంత్రి బుధవారం బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి నారాయణరావు కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎవియేషన్‌కు పుషింగ్ ఇవ్వాలని ఎటిఎస్‌ను 4శాతంకు తగ్గించగా తరువాత ప్రభుత్వాలు 16శాతం చేశాయని, ప్రస్తుతం ఏపిలో ఒక శాతానికి తగ్గించడం వల్ల ఎవియేషన్ కార్యకలాపాలు పెరగడానికి దోహదం చేసిందన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖను ఆధునిక విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 700 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందని, రాజమండ్రి రన్‌వే విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి చేయడం జరిగిందని, ఇవన్ని వస్తే అన్ని రకాల విమానాలు రావడానికి తద్వారా అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, రాజ్యసన సభ్యురాలు తోట సీతామహాలక్ష్మీ, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, బందరు జడ్‌పిటిసి లంకె నారాయణ ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య) పాల్గొన్నారు.