కృష్ణ

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మొవ్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూచిపూడి కార్యాలయంలో ఉద్యోగిపై దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగిందని కూచిపూడి ఎస్‌ఐ వి సతీష్ తెలిపారు. మొవ్వ గ్రామానికి చెందిన గూడపాటి నవీన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూచిపూడి చెక్ పోస్టులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మోపిదేవి మండలం నాగాయతిప్పకు చెందిన టాటా ఏస్‌లో అవనిగడ్డ నుండి టామాటాలు గుడివాడకు రవాణా చేస్తుండగా చెక్ పోస్టుకు సెస్ రూ.150 చెల్లించాలని అడిగిన మీదట ఆగ్రహించిన టాటా ఏస్ డ్రైవర్ కొప్పనాతి బాలాజి ఆగ్రహించి ఇనుపరాడ్డుతో నవీన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్‌ను ఆ ప్రాంత ప్రజలు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆసుపత్రి వారి సమాచారం మేరకు కొప్పనాతి బాలాజీ, తాడేపల్లి గోపిరాజు, కొక్కిలిగడ్డ వాసులుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాసు తెలిపారు.
వెంకటేశ్వరుని సన్నిధిలో విరిగిపడ్డ ధ్వజస్తంభం
హనుమాన్‌జంక్షన్, మార్చి 24: స్థానిక నూజివీడు రోడ్డులోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వర దేవస్థానంలో గురువారం నాడు అపశృతి చోటుచేసుకుంది. పురాతన కాలం నుంచి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్న ధ్వజస్తంభం విరిగిపడింది. గత కొన్ని రోజులుగా ఆలయ పునః నిర్మాణానికి పనులు చేపట్టారు. దాదాపు రూ. 20 లక్షల వ్యయంతో స్వామి వారి గాలిగోపురం నిర్మాణం చేపడుతున్న సమయంలోనే ఈ ధ్వజస్తంభం విరిగిపడటం చర్చనీయాంశమైంది. పునః నిర్మాణ పనులతోపాటు ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్టించేందుకు దేవాదాయ శాఖకు నివేదికలు పంపనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారిణి ప్రకృతాంబ తెలిపారు.