కృష్ణ

స్థల సేకరణకు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 26: నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం ఘాట్ వరకూ చేపట్టదలచిన రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా బ్లూ అండ్ గ్రీన్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన స్థల సేకరణకై సమగ్ర సర్వే నిర్వహించాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ టౌన్ ప్లానింగ్ అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా శనివారం నగరంలోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో చైనా కంపెనీ జిఐసిసి సంస్థ ప్రతినిధులతోపాటు విజయవాడ సబ్ కలెక్టర్ సుజన, విఎంసి టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ బ్లూ అండ్ గ్రీన్ ప్రాజెక్టునకు అవసరమైన స్థల సేకరణలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఎంత ఉందన్న అంశంతోపాటు ప్రాజెక్టు డిజైన్ మారకుండా ప్రైవేటు భూమి సేకరించేందుకు గాను 60:40 నిష్పత్తి ప్రకారం స్థల, నిర్మాణాల స్థితిగతులపై నివేదిక రూపొందించి సేకరణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే ప్రకారం బ్లూ ప్రింట్ సిద్దం చేసి జిఐసిసి చైనా సంస్థకు అందజేసినచో డిజైన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షలో ఎంఆర్‌ఓ శివరావ్, విఎంసి సిఇ ఎంఎ షుకూర్, సిటీ ప్లానర్ ప్రదీప్‌కూమార్ తదితరులు పాల్గొన్నారు.

కాల్వకట్టపై అక్రమంగా తుమ్మచెట్ల నరికివేత
తోట్లవల్లూరు, మార్చి 26: నీరు-చెట్టు చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు కంచే చేను మేసిన చందంగా వేలాది రూపాయల విలువైన తుమ్మచెట్లను వ్యాపారులకు విక్రయించగా సర్పంచ్, నీటి సంఘం అధ్యక్షుడు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బొడ్డపాడు - కంకిపాడు లాకుల మధ్య మార్గంలోని కాల్వకట్టపై శనివారం ఉయ్యూరుకు చెందిన కలప వ్యాపారి ఎండి అయూబ్ నాలుగు తుమ్మచెట్లను కూలీలతో నరికించి ట్రాక్టర్‌లోకి లోడు చేశారు. విషయం తెలుసుకున్న బొడ్డపాడు సర్పంచ్ నిమ్మగడ్డ సీతారాంబాబు, పెనమకూరు నీటి సంఘం అధ్యక్షుడు, కంకిపాడు డిసి వైస్ చైర్మన్ కళ్ళం శివారెడ్డి, బొడ్డపాడు గ్రామ రైతు సూర్యదేవర సత్యనారాయణ, తదితరులు వచ్చి లోడు చేసిన కలప ట్రాక్టర్‌ని అడ్డుకున్నారు. కలప వ్యాపారిని నిలదీయగా కంకిపాడు లాకు జెఈ వెంకటకృష్ణ నాలుగు తుమ్మచెట్లను రూ.5వేలకు అమ్మాడని, అందువల్లనే నరికించినట్లు వారికి చెప్పాడు. దీంతో ఇరిగేషన్ అధికారులను శివారెడ్డి పిలిపించారు. జెఈ వెంకటకృష్ణపై సర్పంచ్ సీతారాంబాబు, శివారెడ్డి, సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన చెట్లను ఈవిధంగా అమ్మేస్తే ఎలా అని నిలదీశారు. బొడ్డపాడు విఆర్‌ఓ బసవయ్య, తోట్లవల్లూరు పోలీసులను పిలిచారు. అయితే తుమ్మచెట్లు నరికిన ప్రదేశం కంకిపాడు పరిధిలోకి వస్తుందని విఆర్‌ఓ తెలపగా కలప ట్రాక్టర్‌ని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.