కృష్ణ

అంతా రోజువారీ కూలీలేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 19: ఐదు నిండు ప్రాణాలను బలిగొని మరో 28 మందిని ఆసుపత్రి పాల్జేసిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం వ్యవహారం నేటికీ ఓ కొలిక్కి రాలేదు. నిందితుల అరెస్ట్ పర్వం పూర్తికాలేదు. అలాగే ప్రాంతీయ ల్యాబ్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నుంచి సమగ్ర నివేదికలు అందలేదు. అయితేనేమి విజయవాడలోనే కాదు రాష్టవ్య్రాప్తంగా 780 బార్ అండ్ రెస్టారెంట్లు, 4250 మద్యం దుకాణాల్లో మద్యం వ్యాపారం ఎంచక్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్వర్ణ బార్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఎంతోకాలంగా కొనసాగుతున్నప్పటికీ సంఘటన జరిగిన రోజు ఎక్సైజ్‌శాఖ కళ్లు తెరచుకుంది. సెల్లార్‌లో ఎలా అనుమతిచ్చారో అంటూ ఆ ప్రాంత సిఐను సస్పెండ్ చేశారు. ఇక నేటి వరకు నగరపాలక సంస్థలో ఏ ఒక్కరిపై కూడా చర్య లేదు. ఈ సంఘటనతో అప్పటివరకు సెల్లార్‌లలో నడుస్తున్న మద్యం కౌంటర్లను ఆఘమేఘాలపై తొలగించి వాటిని స్టాక్ రూమ్‌గా మార్చేశారు. మూడు, నాలుగు అంతస్తుల్లో మూడు, నాలుగు కౌంటర్లతో నడిచే బార్ అండ్ రెస్టారెంట్లకు నిత్యం వందలాది మంది వాహన చోదకులు వస్తున్నప్పటికీ వారి వాహనాలన్నీ రోడ్డుపైనే పార్కింగ్ చేయబడుతున్నా పోలీస్‌శాఖ అసలు పట్టించుకోదు.. ఉదయానే్న విక్రయాలు ప్రారంభించి అర్ధరాత్రి వరకు వ్యాపారం సాగిస్తున్నప్పటికీ ఎస్‌ఐలు కాదు కదా బీట్ కానిస్టేబుళ్లు కూడా అటువైపు వెళ్లరు. నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో కిచెన్ రూమ్‌లుంటేనే బార్‌లకు అనుమతి ఉంటుంది. అత్యధిక బార్‌లలో కిచిన్ రూమ్‌లు కన్పించవు. అందులో సీజ్ చేయబడిన స్వర్ణ బార్‌లో వెలుపల నుంచి తెచ్చి విక్రయించే ఒకే ఒక స్నాక్ వెండర్ పోలీసులకు దొరికి అరెస్టయ్యాడు. మద్యం దుకాణాల్లో మరుగుదొడ్లు లేకపోయినా, పరిసరాల్లోనే అందునా మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు, చెత్తా చెదారంతో కుళ్లి కంపుకొడుతున్నా ఏ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కనె్నత్తి చూడరు. ఏడాదికోసారైనా వాటర్ ట్యాంక్‌ను గాని, ఆహార పదార్థాలను గాని పరిశీలించరు. అసలు మద్యంలో కల్తీ జరుగుతుందనే వార్తా కథనాలు ఎన్ని వెలువడుతున్నా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. ఐదుగురు మరణిస్తే కాని ఆ శాఖ కళ్లు తెరువలేదు. తొలిసారిగా అన్ని మద్యం దుకాణాల్లో మద్యం సీసాలను పరిశీలించారు. ఇలా తరచూ జరుగుతుంటే అసలు కల్తీకి ఆస్కారం ఉండదు కదా.. ఒక్క బార్ అండ్ రెస్టారెంట్‌లో కనీసం 25 మంది నుంచి 60 మంది పైనే వివిధ స్థాయిల్లో సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ అత్యధిక దుకాణాల్లో అటెండెన్స్ రిజిస్టర్లు లేవనే ఆరోపణలున్నాయి. గడచిన 10 మాసాలుగా తనిఖీలు లేవని కార్మికశాఖ ఓ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధితో తెలిపారు. మద్యం అమ్మకాలు ముమ్మరంగా సాగటానికి ఇలాంటి తనిఖీలు అడ్డుతగులుతాయని ప్రభుత్వమే వౌఖిక ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లు లేకపోవటంతో కనీస వేతనాలు అమలు ఎక్కడా లేవు. వీరంతా కస్టమర్ల టిప్పులపైనే ఆధారపడాల్సి వస్తున్నదంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పిఎఫ్, ఇఎస్‌ఐ శాఖల అధికారులు ఏనాడు కూడా తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది సిబ్బంది ఉంటే ఇఎస్‌ఐ, 20 మంది ఉంటే పిఎఫ్ అమలుచేయాలి. అదేం చోద్యమో కాని ఏ ఒక్క కార్మిక సంఘం కూడా వీటి కోసం మద్యం దుకాణాల వద్ద కనీసం ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. జీతాలు ఎలా ఉన్నా పిఎఫ్ కల్గిన సభ్యులు ఎవరైనా మరణిస్తే నామినీదారునికి జీవితాంతం కనీస పెన్షన్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అనారోగ్యానికి గురైతే ఎన్ని లక్షలు ఖర్చయినా ఇఎస్‌ఐ భరిస్తుంది. అలాగే ఆ సమయంలో వేతనం కూడా లభిస్తుంది. మూతబడితే ఆరుమాసాల వేతనం లభిస్తుంది. ఇక తూనికల కొలతల శాఖ అధికారులు బడ్డీ బంకులపై దాడులు చేస్తారు కాని మద్యం దుకాణాల జోలికి వెళ్లరు. ఎంఆర్‌పి ధరలకే విక్రయించాలని ప్రభుత్వం చెబుతున్నా ఏ మద్యం దుకాణంలోనూ అలా జరుగటం లేదు. బిల్లులు కూడా ఇవ్వటం లేదంటున్నారు. ఇలా ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా మద్యం దుకాణం జోలికి వెళ్లకపోవటంలో ఆంతర్యం ఏమిటంటే ఎంచక్కా రోజువారీ.. లేదా నెలవారీ మామూళ్లు వెళుతుండటం దీనికి కారణం. రెండేళ్ల క్రితం జరిగిన ఎసిబి దాడుల్లో రాష్టవ్య్రాప్తంగా మద్యం సిండికేట్ కార్యాలయాల్లో లభించిన పుస్తకాలను ఒక్కసారి పరిశీలిస్తేనే అర్థమవుతుంది. రోజువారీ ఏ శాఖలో ఏ వ్యక్తికి ఏ రూపేణా ఎంత అందుతున్నదీ వివరంగా రాసి ఉండటం జరిగింది. ఈ పుస్తకాలన్నీ నేటికీ న్యాయస్థానాల్లో సీజ్ చేయబడి ఉన్నాయి. వీటి ఆధారంగానే అనేక కేసులు నమోదయ్యాయి. అయినా నేటికీ ఆ మామూళ్ల పర్వం యథేచ్ఛగా జరుగుతున్నదనటానికి పై శాఖలో ఏ ఒక్క శాఖ కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవటమే ప్రబల నిదర్శనం కాగలదు.