కృష్ణ

ప్రమాదానికి గురైన తహశీల్దారుకి ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 4: శ్రీశైలం యాత్రకు బయలుదేరి మార్చి 11న ప్రమాదానికి గురైన గుడివాడ తహశీల్దారు కొత్తపల్లి రవి శంకర్‌కు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరపున రూ.6 లక్షల 61వేల 700 చెక్కును జిల్లా కలెక్టర్ బాబు.ఎ అసోసియేషన్ ప్రతినిధులకు అందచేశారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో జిల్లా, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ తరపున సేకరించిన మొత్తాన్ని కలెక్టర్ బాధిత తహశీల్దారు ఖాతాకు జమచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక మంచి తహశీల్దారుకు ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. బాధిత తహశీల్దారు సహాయార్ధం ముందుకు వచ్చిన రెవెన్యూ అసోసియేషన్ ఔదార్యాన్ని కలెక్టర్ ప్రశంసించారు. టీమ్ కృష్ణాతరపున తహశీల్దారు కుటుంబానికి సంపూర్ణ సహకారం ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు సిహెచ్ చంద్రశేఖరరావు, బిఎస్‌పాల్, ఆర్ సాంబశివరావు, కెఎస్‌పాల్, శంకర్ కలెక్టర్ నుండి చెక్కును స్వీకరించారు.
గుడివాకవారిపాలెంలో
వివాహిత ఆత్మహత్య
అవనిగడ్డ, ఏప్రిల్ 4: మండల పరిధిలోని వేకనూరు పంచాయతీ శివారు గుడివాకవారిపాలెంకు చెందిన వివాహిత మత్తి నాగమణి (23) ఆత్మహత్య చేసుకుంది. తమ పిల్లాడి తొలి పుట్టిన రోజును ఘనంగా చేద్దామని భర్త సుందరరావును కోరగా తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో మనస్థాపం చెందిన నాగమణి గత నెల 30న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలైన నాగమణిని తొలుత అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం నాగమణి మృతి చెందింది. ఈ మేరకు రైటర్ వెంకటేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగా విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ
కొవ్వొత్తుల ప్రదర్శన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 4: స్థానిక నిజాంపేటలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాత్రి పట్టణంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాధా-రంగా మిత్ర మండలి సభ్యులతో పాటు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని విగ్రహ ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిజాంపేట రంగా విగ్రహం నుండి బయలుదేరి ప్రదర్శన రేవతి సెంటరు, రాజాగారి సెంటరు మీదుగా కోనేరుసెంటరు వరకు చేరింది. వందలాది మంది యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని జోహార్ రంగా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మిరియాల రామకృష్ణ, మేకల సుబ్బన్న, డా. రాధిక మాధవి, మాదివాడ రాము, గనిపిశెట్టి గోపాల్, బుల్లెట్ ధర్మారావు, పంచపర్వాల కాశీ విశ్వనాధం, గంటా సురేష్, అనుమకొండ కుటుంబరావు, నీలం, కొట్టె వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
అత్యాచారయత్నం చేసిన యువకునిపై నిర్భయ కేసు
కైకలూరు, ఏప్రిల్ 4: మండలంలోని రామవరంలో శనివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేయబోయిన ఇద్దరు యువకులపై సోమవారం రూరల్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సిహెచ్ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం శనివారం రాత్రి రామవరం గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు బహిర్భూమికి వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కురేళ్ల రాంబాబు, ఇంటి వెంకటేవులు మోటారు సైకిల్‌పై వచ్చి జడపట్టుకుని లాగి అత్యాచారంకు పాల్పడగా కేకలు వేయడంతో పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం నిర్భయ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తెలిపారు.