కృష్ణ

లక్ష ఖాళీల మాటేంటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 4: ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు.. లక్ష ఉద్యోగాలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తోందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇంటికో ఉద్యోగం అని, ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రెండువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం నిరుద్యోగులకు ఒక నయాపైసా ఇవ్వలేదని వారు సర్కార్ పనితీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ కురిపించిన వాగ్దానాలు చేసిన సియం బాబు నేడు క్రమబద్ధీకరణ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండేళ్లపాటు కాలం గడిపేశారన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను దాచిపెట్టి కొన్ని ఖాళీలను మాత్రమే చూపిస్తూ నిరుద్యోగులను మోసం చేసేందుకు ఇప్పటికే అధికార పార్టీ కాకిలెక్కలు చూపటానికి రంగం సిద్ధం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా 20వేల ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతూ మరొక వైపు లక్ష ఉద్యోగ ఖాళీలకు ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఇందుకు ఆర్థికశాఖ గణాంకాలను పరిశీలిస్తే విషయం అందరికి స్పష్టంగా అవుతోందని నిరుద్యోగులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలకు సంబంధించిన 1,42,825 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు విభజనపై ఏర్పాటైనా కమలనాథన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాన్ని ఈసందర్భంగా నిరుద్యోగులు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 2ఏళ్లు పెంచినప్పటికీ 2016, జూన్ నాటికి సుమారు 30వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు జూన్‌నాటికి మొత్తం 1,72,820 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు చెప్పటం గమినిస్తే మిగిలిన 95,088 పోస్ట్‌లు ఎక్కడ పోయినట్లు అని నిరుద్యోగులను ప్రస్తుతం వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న. ఈపరిస్థితుల్లో దశలవారీగా 20వేల పోస్ట్‌ల భర్తీ ప్రకటనపైనా నిరుద్యోగులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన టీచర్ పోస్ట్‌లకు పరీక్షలు నిర్వహించి నెలలైనా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి కూడా నియామాక ఉత్తర్వులు జారీ చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్టమ్రైన తెలంగాణ నోటిఫికేషన్లులు వరుసగా ఇస్తుంటే ఎపిలో విభజన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వెలువడలేదని నిరుద్యోగులు ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. మరొక వైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదల చేసేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం ఏపీపీఏస్సీ ఎదురుచూస్తుందని నిరుద్యోగులు పేర్కొన్నారు. ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవాటినే కుదించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించి నిరుద్యోగులను మరింత మానసిక ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.