కృష్ణ

తెలంగాణ సర్కార్ రీడిజైనింగ్ ప్రాజెక్టులతో ఎపికి జలగండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏఫ్రిల్ 9: లక్ష కోట్లు ఖర్చుపెట్టి, కోటి ఏకరాలకు పైగా సాగునీరు అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వలన నవ్యాంధ్రప్రదేశ్‌కు జలగండం పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపటం లేదని పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం బెంజిసర్కిల్ వద్ద వేదిక కల్యాణ మండపంలో రైతాంగ సమాఖ్య అధ్యక్షులు యర్నేని నాగేంద్రనాథ్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంద్రీశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో ఆంధ్రాకు విపత్కర పరిస్థితులు దాపురించాయని కనుక రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం పార్టీలకతీతంగా కలసి ముందకు సాగుదామని చెప్పారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవధార అని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూరైయితేనే ఆంధ్రప్రదేశ్‌కు ఊరట లభిస్తుందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనాయకుడు, మాజీ మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం వలనే రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. పట్టిసీమకు మూడు మోటార్లు బిగించి నదుల అనుసంధానం అంటున్నారని, పట్టిసీమతో నష్టం తప్ప లాభం లేదన్నారు. అనాడే నదుల అనుసంధానం సర్వే కోసం మాజీ ప్రధాని వాజ్‌పేయ్ 800 కోట్లు కేటాయించిన సంగతి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు నష్టం జరుగుతుందని మన పాలకులు చెప్పే స్థితిలో లేరన్నారు. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల వలన మనకు జరుగుతున్న అన్యాయానికి బేషజాలకు పోకుండా అందరం కలిసి ఆంధ్రపదేశ్‌కు రావల్సిన నీటి పంపకాల కోసం కలిసి పనిచేద్దామన్నారు. మాజీ కేంద్రమంత్రి, వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన పాలకులు స్వప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రాల కోసం తాకట్టు పెట్టకూడదన్నారు. ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల అక్రమ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్‌కు దుర్భర పరిస్థితులు రాబోతున్నాయని తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న దేవగౌడ కర్నాటక స్వప్రయోజనాల కోసం ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపెంచి తీవ్ర అన్యాయం చేశారని గుర్తుచేశారు. ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం రీ డిజైనింగ్ ప్రాజెక్టుల వలన ఆంధ్రాకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర పాలకులు నోరుపెదపకపోవటం చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోలవరం సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి ఆయకట్టు కింద ఉన్న రైతులకు మొదటి పంటకు కూడా సాగునీరు రావటం కష్టంగా మారిందన్నారు. నాగార్జుసాగర్ రిజర్వాయర్ నిండి పొంగి పొర్లితేనే గానీ పులచింతలకు నీరురాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వలన నాగార్జునసాగర్ ఎండిపోయే పరిస్థితులు రాబోతున్నాయని తెలిపారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షులు యేర్నేని నాగేంద్రనాధ్ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టి కోటి ఏకరాలకు సాగునీరు అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రాజెక్టుల నిర్మాణానికి 25 వేల కోట్లు కేటాయించి, కొన్ని ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి యేర్నేని సీతాదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనకొండ శివాజీ, రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీరు ఎస్.సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్.ఇ.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఉల్లాసానికి సినిమానే సాధనం
నాగాయలంక, ఏప్రిల్ 9: మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికే సినిమాలే సాధనంగా నిలుస్తాయని హాస్య నటుడు వేణు అన్నారు. స్థానిక అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఉగాది పురస్కారాలు, సాంస్కృతిక సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలుగు వారికి తొలి పండుగగా ఉగాదిని జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నదేనని, దీనిలో తాను పాల్గొనడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను కలుసుకునే అవకాశం ఏర్పడినందుకు ఆనందంగా ఉందన్నారు. నేటి తరం నటులు అందరితో తాను నటించానని, తాను పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు. సంస్థ అధ్యక్షులు తలశిల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునికత తెలుగు వారి సంస్కృతిని, సాంప్రదాయాలను దూరం చేస్తున్న పరిస్థితుల్లో సాహిత్య, సాంస్కృతిక, కళా సేవా సంస్థ పేరుతో 1921వ సంవత్సరంలో అభ్యుదయ వేదిక అవిర్భవించిందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రాధాన్యతా రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి ఉగాది రోజున పురస్కారాలు ఇవ్వటంతో పాటు దాతల సహకారంతో నిరుపేదలకు వస్తద్రానం కూడా చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వర్రె రాంబాబు, వైసిపి నేత గుడివాక శివరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు లోగిలి వ్యవస్థాపకులు పేర్ల శ్రీనివాసరావు, కవి, రచయిత కొట్టె రామారావు, కృష్ణ జ్యోతి సంపాదకులు మత్తి శ్రీకాంత్, డ్రైనేజీ డిఇ మారుతీ ప్రసాద్, నర్తకులు పావని, హరిణిలను ఘనంగా సత్కరించారు.

ఘనంగా సాంస్కృతిక పాఠశాల వార్షికోత్సవం
కూచిపూడి, ఏప్రిల్ 9: మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలోని లక్ష్మీపతి విద్యా విహార్ సాంస్కృతికోన్నత పాఠశాల 59వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్, ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తేవి సీతారాం గురుదేవులు అనుగ్రహభాషణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోనేపూడి దయాకర్ వార్షిక నివేదిక అందజేశారు. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కళాశాల సాంస్కృతిక శాఖాధిపతి ఐ శ్రీనివాస్, మొవ్వ ఎంపిపి కిలారపు వ