కృష్ణ

వడదెబ్బ మందు విక్రయాలకు విఎంసికి సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 11: విఎంసి పరిధిలోని నగర ప్రాంతాల్లో నగర ప్రజలకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు గాను హోమియో మందులను విక్రయించడం లేదని కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా తగు నివారణ మందులంటూ కొంతమంది వ్యక్తులు కార్పొరేషన్ ఆధ్వర్యంలో హోమియో పిల్స్‌ను రూ.15కు విక్రయిస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమియో మందుల విక్రయదారులకు, విఎంసికి సంబంధం లేదని కమిషనర్ వీరపాండియన్ ఉద్ఘాటించారు. ఇటువంటి వ్యక్తులు నగర పరిధిలో కనిపించినా, విక్రయించినా అట్టివారిని సమీప పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలని ఆయన సూచించారు. వడదెబ్బ నివారణకు నిపుణులైన వైద్యుల సలహాతోనే మందుల వినియోగం ఉండాలని ఆయన సూచించారు.