కృష్ణ

వ్యవసాయ రుణ ప్రణాళిక సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రుణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గత కొనే్నళ్ళుగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకర్లు ప్రతి యేడాది మాదిరిగా 2015-16 సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఈ యేడాది రూ.4వేల 785 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఐదేళ్ళుగా పోలిస్తే పంట రుణాల లక్ష్యాన్ని ఈ యేడాది మరింత పెంచారు. ప్రతి యేడాది బ్యాంక్‌లు ఏప్రిల్‌లో రుణ లక్ష్యాలను నిర్దేశిస్తాయి. వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు ఉంటాయి. వ్యవసాయ రుణాలకు గతంలో తక్కువ కేటాయింపులు ఉండేవి. గత యేడాది 2014-15 సంవత్సరంలో రూ.4వేల 317 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా దాన్ని అధిగమించారు. రూ.4వేల 322కోట్లు రుణాలు పంపిణీ చేసి నూరు శాతం లక్ష్యాన్ని ఛేధించారు. ఈ యేడాది రుణ ప్రణాళిక లక్ష్యాన్ని మరింత పెంచారు. రూ.4వేల 785కోట్లు అంటే 468కోట్లు అదనంగా ఇవ్వనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. గత కొనే్నళ్ళుగా అతివృష్టితో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి ఈ రుణ ప్రణాళిక కొంత ఊరట కల్పించే అంశంగా మారింది. రానున్న ఖరీఫ్‌కు సాగునీటి విషయంలో స్పష్టత వస్తే రైతులు మరింత సంబరపడనున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దాళ్వాకు సాగునీరు ఇవ్వకపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. దాళ్వా స్థానంలో అపరాలు సాగు చేశారు. అపరాల సాగు కూడా నీటి తడులు లేక అష్టకష్టాలు పడి పైర్లను పండించుకున్నారు. దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చినా కొంతలో కొంత ధర పలకటంతో సంతృప్తిగానే ఉన్నారు. కానీ అపరాలు సాగు చేసిన కొంత మంది రైతులు మాత్రమే దిగుబడులు సాధించి మంచి ధర పొందారు. ప్రస్తుతం రైతులంతా ఖరీఫ్‌పైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. సకాలంలో సాగునీరు అందుతుందా..? లేదా..? అన్న మీమాంశలో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా నీటి విడుదల ఉంటుందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఖరీఫ్‌పై కొంత నమ్మకంతో రైతులు ఉన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని కూడా భారీగా పెంచడం మరింత వెసులుబాటుగా భావిస్తున్నారు.
గత ఐదేళ్ళుగా రుణ ప్రణాళిక లక్ష్యాలు
సంవత్సరం లక్ష్యం పూర్తి (రూ.కోట్లలో)
2011-12 1,576 1,618
2012-13 2,178 2,323
2013-14 3,049 3,200
2014-15 4,200 2,200
2015-16 4,317 4,320
2016-17 4,785