కృష్ణ

పట్టణ న్యాయవాదుల సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (లీగల్), ఏప్రిల్ 23: మచిలీపట్టణం న్యాయవాదుల సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సంఘ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తుంగల హరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం సంఘ పెద్దలు సమావేశమై ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నించారు. రంగంలో ఉన్న అభ్యర్థులు పెద్దల సూచనలతో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాసరావు బి.కాం బిఎల్‌లో పట్ట్భద్రులై 1992 నుండి న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. గతంలో న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించి పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా గుమ్మడి సుబ్బారావు, కార్యదర్శిగా మెతుకుమిల్లి సీతారాం, గ్రంథాలయ కార్యదర్శిగా పెదపూడి దామోదరరావు, కోశాధికారిగా పుప్పాల వెంకట్రావ్, కార్యవర్గ సభ్యులుగా కొట్టి రఘురాం, కలవ వాణి సునంద, మోచర్ల తిరుమలరావు, పొన్నూరు వెంకటరమణ, మహ్మద్ ఖాజామొహిద్దీన్, కర్ణాటకపు పాండురంగ విఠల్ కుమార్, ముక్తేవి వెంకట సీతారామచంద్రమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది వింజమూరి శివరామ్ వ్యవహరించారు.

అధికారులపై మంత్రికి
చైర్మన్ హన్ను ఫిర్యాదు
పెడన, ఏప్రిల్ 23: తాను ఇన్‌చార్జ్ చైర్మన్‌నని అధికారులంతా చిన్నచూపు చూస్తున్నారని, ఏ అధికారీ తన మాట వినడం లేదని చైర్మన్ హన్ను శనివారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఏ ఒక్క అధికారి కూడా తన చెప్పుచేతల్లో లేరని, తాను చెప్పిన పనులేవీ చేయడం లేదని శనివారం పట్టణ పర్యటనకు వచ్చిన మంత్రికి ఆయన మొరపెట్టుకున్నారు. పట్టణంలో చెత్త సేకరించే విషయంలో అధికారులకు అసలు అవగాహన లేదనే విషయాన్ని తాను గమనించానన్నారు. ఏ అధికారి కూడా వీధుల్లో తిరగడం లేదని, కమిషనర్‌కు సిబ్బందిపై నియంత్రణ లేదని ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారానికి తానొక్కడినే పోరాడుతున్నానని హన్నుకు మంత్రి నారాయణకు వివరించారు.

హృదయ స్పందనలే పుస్తకాలు
* ఈడ్పుగంటి
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 23: కాలం గడిచినకొద్దీ పుస్తక ప్రపంచం మరింత తాజాగా మానవ హృదయాల్లోని భావాలను స్పందింపజేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు మాట్లాడుతూ ఆంగ్ల నాటక రచయిత షేక్‌స్పియర్ జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు విడియాల చక్రవర్తి మాట్లాడుతూ పుస్తకాలు మనకి బోధిస్తాయని, సుఖపెడతాయని, ఊరట కలిగిస్తాయని, హృదయాలను ఆవిష్కరిస్తాయని వివరించారు. భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుగోలు చేయాలని సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పేర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బందరు చరిత్ర పుస్తక రచయిత ఎండి సిలార్, సాహితీవేత్తలు, పుస్తకప్రియులు పాల్గొన్నారు.