కృష్ణ

దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 26: దైవ దర్శనానికి వెళ్లిన ఒక కుటుంబం అనంతలోకాలకు చేరుకుంది. ఉన్నత చదువులు చదివి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించిన దివిసీమకు చెందిన తలగడదీవి కోటేశ్వరప్రసాద్ కుటుంబం శుక్రవారం అర్ధరాత్రి కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం ఈప్రాంత వాసులను తీవ్రంగా కలచివేసింది. స్థానిక 5వ వార్డు లంకమ్మ ప్రాంతానికి చెందిన తలగడదీవి బాలకృష్ణారావు కుమారుడు కోటేశ్వరప్రసాద్(35) బీదర్‌లో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. తన భార్యబిడ్డలు, అత్త, బావమరిదితో కలిసి మూడురోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్‌లోని వినాయకుని దర్శించారు. తిరిగి తమ కారులో వీరంతా బీదర్ వెళుతుండగా కర్నాటక రాష్ట్రం నాయకల్ మండలం గర్వాడ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కోటేశ్వరప్రసాద్, భార్య సునీత(30), మూడేళ్ల కుమారుడు చేతన్, అత్తగారు అక్కడిక్కడే మృతిచెందారు. ఐదేళ్ల కుమార్తె యశిత, బావమరిది భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న కోటేశ్వరప్రసాద్ తల్లిదండ్రులు హుటాహుటిన కర్నాటకకు బయలుదేరి వెళ్ళారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటంతో స్థానిక 5వ వార్డులో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. మృతుని తండ్రి బాలకృష్ణారావు అవనిగడ్డ సహకార కేంద్ర బ్యాంక్‌లో పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. కోటేశ్వరప్రసాద్ పదో తరగతి వరకు అవనిగడ్డలోని శిశు విద్యామందిరంలో విద్యనభ్యసించాడు. గుంటూరు జిల్లా నగరం కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికై బీదర్ వద్ద పని చేస్తున్నాడు. 2017లో కోటేశ్వరప్రసాద్ కాంట్రాక్టు ముగిసి తిరిగిరావాల్సి ఉంది.
నేడు అవనిగడ్డకు మృతదేహాలు
ప్రమాదంలో మృతిచెందిన కోటేశ్వరప్రసాద్, సునీత, కుమారుడు చేతన్, అత్తగార్ల మృతదేహాలు ఆదివారం అవనిగడ్డ చేరుకునే అవకాశాలు ఉన్నాయని బంధువర్గాలు తెలిపాయి. ఇప్పటికే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్టు తెలిసింది. అవనిగడ్డలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ద్విచక్ర వాహనాలు ఢీ..
ముగ్గురి మృతి
వత్సవాయి, డిసెంబర్ 26: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ దుర్ఘటన మండలంలోని రింగాల బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సింగవరం గ్రామానికి చెందిన దేవరపోగు శ్రీను(30), కుమారుడు (6నెలలు), భార్య రాజేశ్వరితో కలిసి బాబుకు వైద్య చికిత్స కోసం వత్సవాయి తీసుకొచ్చారు. తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్(40) తన ద్విచక్ర వాహనంపై బోనకల్లు వైపు వెళుతున్నాడు. రింగాల బ్రిడ్జిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో దేవరపోగు శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజేశ్వరి, నజీర్, ఆరేళ్ల బాలుడు 108లో జగ్గయ్యపేట తరలిస్తుంగా మార్గంమధ్యలోనే నజీర్, బాలుడు మృతిచెందారు. రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.