కృష్ణ

ట్రస్ట్‌బోర్డు వివాదంపై గ్రామస్తుల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ హేమకోదండ రామాలయం ట్రస్ట్‌బోర్డు వివాదంపై బుధవారం గ్రామస్తులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా సీనియర్ సివిల్ జడ్జి రాజీవ్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమావేశం అనంతరం ఉల్లిపాలెం రామాలయం ట్రస్ట్‌బోర్డు వివాదాన్ని గ్రామస్తులంతా కలిసి సీనియర్ సివిల్ జడ్జికి వివరించారు. 1934 నుండి గ్రామస్తుల సహకారాలతో ఆలయ అభివృద్ధి జరగ్గా ఇటీవల శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని గ్రామానికి చెందిన ఉల్లి విజయ భాస్కరరావు అనే వ్యక్తి ఈ గుడి తమ సొంత ఆస్తిగా చూపిస్తూ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి రాజీవ్ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. న్యాయసేవాధికార సంస్థలో కేసు విచారణకు తీసుకున్నట్లు తెలిపారు. సదస్సులో గ్రామ సర్పంచ్ భర్త శ్రీపతి చంద్రబాబు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తాతా వెంకట దుర్గా ప్రసాద్, న్యాయవాది చీలి ముసలయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతితో
ఆళ్లూరుపాడులో విషాదఛాయలు
వత్సవాయి, ఏప్రిల్ 27: మండలంలోని ఆళ్లూరుపాడు గ్రామానికి చెందిన మూడు తరాలకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పణితి గాంధీ (45), భార్య మరియమ్మ, కుమారుడు హరీష్ (23), మనుమరాలు లక్ష్మీప్రసన్న (6)లు బైక్‌పై నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిలుకూరుకు వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో మరియమ్మకు స్వల్ప గాయాలతో బయటపడగా మిగిలిన ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులను ఆహ్వానించేందుకు బయలుదేరిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజు వారి కూలీగా జీవనం సాగిస్తూ గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ఈ కుటుంబంలో ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. వైకాపా రాష్ట్ర నేత సామినేని ఉదయభాను వారి మృతదేహాలకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.