కృష్ణ

దుర్గాఘాట్, ఫెర్రిఘాట్ విస్తరణ పనులు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: దుర్గాఘాట్, ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ విస్తరణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్, ఫెర్రీఘాట్ విస్తరణపై జలవనరులశాఖ అధికారులు, చైనా టీం, మున్సిపల్ కార్పొరేషన్, సోమా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాఘాట్ నుండి భవానీపురం వరకు 2.03కి.మీ విస్తరించే ఘాట్, ఇబ్రహీంపట్నం ఫెర్రి మధ్య రెండు కిలో మీటర్లు ఘాట్ విస్తరణకై చేపడుతున్న పనులను సమీక్షించారు. రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా నిర్మించతలపెట్టిన చారిత్రక కట్టడంగా నిలిచిపోయే విధంగా ఘాట్ విస్తరణకు చైనా టీం డిజైన్‌లను రూపొందించిందన్నారు. డిజైన్‌కు అనుగుణంగా మార్కింగ్ నిర్వహించుకుని పనులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నాలుగు లైన్లు కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సమాంతరంగా ఘాట్ విస్తరణ చేపట్టాలని, ఇందుకు ముందుగా రిటైనింగ్ వాల్ నిర్మాణం మార్కింగ్ నిర్వహించుకోవాలన్నారు. బ్యారేజీలో నీటి నిలువ తక్కువ ఉన్నందున పనులను త్వరితగతిన ప్రారంభిస్తే జూన్ వర్షాకాలం నాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద జరుగుతున్న అప్రాన్ పనులు, చీమలవాగు వద్ద పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు జరుగుతున్న వేగాన్ని అధికారులు స్ఫూర్తిగా తీసుకుని 45 రోజులలోపుగా పూర్తి చేసేలా ప్రణాళికా రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. దుర్గాఘాట్, ఫెర్రి వద్ద నిర్మాణానికి అనుగుణంగా క్లీనింగ్ పూర్తి చేసి సిద్ధం చేశామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పగలు ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువ గంటలు పని చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనులకు అవసరమైన పొక్లెయిన్‌లను, టిప్పర్‌లను సిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బ్యారేజీపై విద్యుత్ వెలుగులకు టెండర్లు
పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై విద్యుత్ అలంకరణకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సుమారు రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే విద్యుత్ అలంకరణకు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి ఎంపికైన కంపెనీ నిర్వహణ చూడవలసి ఉంటుందని, ఆ కాలంలో విద్యుత్ బల్బులు పాడైనా, అంతరాయం ఏర్పడినా సంబంధిత కంపెనీ నిర్వహణ చేపట్టే విధంగా టెండర్లలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియ జూన్ 20 నాటికల్లా పూర్తి చేసి బ్యారేజీపై విద్యుత్ అలంకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు.