కృష్ణ

పాత్రికేయులపై దాడుల నిరోధానికి హైపవర్ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 2: పాత్రికేయులపై దాడులు నిరోధించేందుకు రాష్టస్థ్రాయిలో హోం మంత్రి ఆధ్వర్యాన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రమాద బీమా పథకం ధృవపత్రాలను పాత్రికేయులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ పాత్రికేయులు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారి కుటుంబాలకు ఈ పథకం కింద రూ.10 లక్షలు బీమా సొమ్ము చెల్లిస్తారన్నారు. పాత్రికేయులు చాలావరకు పేద కుటుంబాల నుంచి వచ్చినవారేనని, వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 16వేల మందికి గుర్తింపు కార్డులు మంజూరు చేశామన్నారు. వీరిలో 6400 మంది పాత్రికేయ కుటుంబాలకు ఆరోగ్య కార్డులు మంజూరు చేశామని, 60లక్షల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. దీన్ని వినియోగించి వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అవకాశాన్ని బట్టి పాత్రియులకు ఇళ్లస్థలాల మంజూరుకు తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నష్టాల నుంచి అభివృద్ధి చెందే దిశలో పయనిస్తోందని, ఈ సమయం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడంలో అత్యంత కీలకమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రచారమాధ్యమాలు అత్యంత సూక్ష్మమైన విశే్లషణలు చేసి ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయాలన్నారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చంద్రబాబు కోరారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని 11,500 మంది పాత్రికేయులకు వర్తింపచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా అక్రిడిటేషన్‌ల మంజూరు కమిటీల్లో రాష్ట్రంలో ఎనిమిది జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. ఆరోగ్య కార్డుల ద్వారా ప్రతి ఏటా రూ.2,50,000 వరకు నగదు రహిత వైద్యాన్ని పాత్రికేయులకు అందిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డెస్క్ జర్నలిస్టులకు, న్యూస్ ప్రజెంటర్లకు అక్రిడిటేషన్‌లు మంజూరు చేశామన్నారు. వర్కింగ్ జర్నలిస్టులతో సమానంగా వీరికి ప్రభుత్వం తరపున అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అంతకుముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బ్యూరోచీఫ్‌లు ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత, డెప్యూటీ డైరెక్టర్ బాలగంగాధర్ తిలక్, తదితరులు పాల్గొన్నారు.

టిడిపికి ప్రజా సమస్యలు పట్టవా?
నూజివీడు, మే 2: అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వివిధ పథకాల పేరుతో కాలక్షేపం చేస్తోందని నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. వేసవిలో గ్రీష్మతాపంతో ప్రజలు అల్లాడుతూ, మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైకాప పిలుపు మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశకు వినతిపత్రం అందజేశారు. ధర్నా సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంలోని పెద్దలు ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూఠీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న వైకాప పిలుపు మేరకు ఆందోళనలు చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు కొంతమంది కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని, ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇటువంటి పుకార్లను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏమాత్రం నమ్మవద్దని అన్నారు.