కృష్ణ

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగర విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నగర కీర్తి ప్రతిష్ఠను పెంపొందించాలన్న లక్ష్యంతోనే విఎం సి ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబరాలను నిర్వహిస్తున్నట్టు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య విఎంసి స్టేడియంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ విజయవాడ నగర విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన విఎంసి పాఠశాలలకు ప్రోత్సాహకంగా వాటి అభివృద్ధికి 50వేల రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 10/10 మార్కులు సాధించి విఎంసి విద్యార్థులకు ఇంటర్ విద్యకు అయ్యే ఖర్చును విఎంసియే భరాయించే ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం చదువులోనే కాక ఆటల్లోనూ ప్రతిభ కనబర్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యలో ఉజ్జ్వల భవిష్యత్తుకోసం కార్పొరేట్ స్కూల్స్‌తో పోటా పోటీగా ఐఐటి ఫౌండేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని, తల్లిదండ్రులు తమ పిల్లలను విఎంసి స్కూల్స్‌లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం ఆటల్లోనే కాకుండా మ్యూజిక్, డ్రాయింగ్ వంటి కళల్లో కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసామన్నారు. ఈ సందర్భంగా శిక్షణకు విచ్చేసే పిల్లలకు అల్పాహారం పంపిణీ నిమిత్తం అయ్యే ఖర్చులో సుమారు 50వేల రూపాయలను అందజేసిన విఎంసి విద్యా ప్రత్యే క కమిటీ చైర్మన్, 45వ డివిజన్ కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్‌ను సందర్భంగా కమిషనర్ వీరపాండియన్, మేయర్ కోనేరు శ్రీ్ధర్ లు ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో డివైఇవై దుర్గాప్రసాద్, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ చౌదరి, ఎంబిపి స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాగోలు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సభానంతరం క్రికెట్, హాకీ, వాలీబాల్, బాడ్మింటన్ తదితర ఆటల పోటీలను ప్రారంభిస్తూ మేయర్ శ్రీ్ధర్, కమిషనర్ వీరపాండియన్ కొద్దిసేపు క్రీడాకారులతో ఆయా ఆటలు ఆడి ప్రోత్సహించారు.

కథలు చెబితే ఇంటికి వెళతారు
* మెయిల్స్ కూడా చెక్ చేయకపోతే ఎలా..?
* అధికారుల పనితీరుపై జెసి అసహనం
ఖచ్చితంగా ఇ-ఆఫీస్ అమలు చేయాలంటూ ఆదేశం

మచిలీపట్నం, మే 2: పని చేయకుండా కథలు చెబితే ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులపై ఫైర్ అయ్యారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత వివిధ అంశాలపై సమీక్షించిన జెసి అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు తమ మెయిల్స్ కూడా చూడటం లేదన్నారు. ఫలితంగా తాము కోరిన విలువైన సమాచారానికి సమాధానం రావడం లేదన్నారు. స్పెషల్ రిప్రజెంటీవ్‌గా కోమటి జయరామ్‌ను ప్రభుత్వం గతంలో నియమించిందన్నారు. పరిశ్రమల స్థాపన, దత్తత గ్రామాలు తదితర అంశాలపై కోటి జయరామ్ కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఏప్రిల్ 21న అన్ని శాఖల అధికారులకు మెయిల్స్ పెట్టామని, అయితే చాలా మంది అధికారులు సంబంధిత మెయిల్స్‌ను చూడకపోవడం గర్హనీయమన్నారు. కనీసం మెయిల్స్ కూడా చెక్ చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. అధికారులు నిద్రమత్తు వీడాలని సూచించారు. ఇదే కాకుండా ఆర్‌ఓ ప్లాంట్‌ల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు తదితర అంశాలపై కూడా తాను సమాచారం కోరగా ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడాన్ని జెసి తప్పుబట్టారు. జన్మభూమి గ్రామసభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో గృహ నిర్మాణ సంస్థ, జిల్లా పౌర సరఫరాల శాఖ వెనుకంజలో ఉన్నాయన్నారు. ఇ-ఆఫీస్ అమలులో కూడా అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తనకు, కలెక్టర్‌కు మాత్రమే ఇ-ఆఫీస్ ద్వారా ఫైల్స్ పంపించి చేతులు దులుపుకుంటున్నారని ఆయా శాఖల్లో అంతర్గతంగా ఇ-ఆఫీస్‌ను అమలు చేయడం లేదన్నారు. ప్రతి ఫైల్‌ను ఇ-ఆఫీస్ ద్వారానే పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ట్రైనీ కలెక్టర్ సలోని, సిపిఓ రత్నాకర బాబు, జడ్‌పి సిఇఓ నాగార్జున సాగర్, ఐసిడియస్ పిడి కృష్ణకుమారి, ఎల్‌డియం వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.