కృష్ణ

ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 4: సిబార్ డెంటల్ కాలేజి ఎండిఎస్ విద్యార్థి ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సిబార్ డెంటల్ కాలేజీలో గతంలో దళిత విద్యార్థిని జెస్సీ మాధురి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులను పలు విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని, బిసి విద్యార్థి అయిన ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్యకు కాలేజీ హెచ్‌ఓడి డా బొల్లా నగేష్, రిసెర్చ్ గైడ్ వేమూరి సాయిష్‌లే కారణమని వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడుని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల వేధింపుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఎపి ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో విఫలమైందన్నారు. ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరీ, సుమలత, శ్రీ లక్ష్మి, వరలక్ష్మి వంటి అనేక మంది విద్యార్థులు కళాశాలల యాజమాన్యాల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రైవేట్ విద్యా వ్యాపారానికి ఏపి ప్రభుత్వం ప్రోత్సహించటం వల్లే ఇటువంటి ఆత్మహత్యలకు నవ్యాంధ్రప్రదేశ్ నిలయంగా మారిందని ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, దీని వల్ల ఉన్నత విద్యకు బిసి, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు దూరమవుతారని, ఉన్నత విద్యకు బలహీనవర్గాలను దూరం చేసే కుట్రకు ప్రభుత్వం విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. కళాశాలల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆత్మహత్యలను నివారించేందుకు తల్లిదండ్రుల ‘ప్రైవేట్ విద్య’ అనే ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై, ఆత్మస్ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంకి చెందిన బిసి మైనార్టీ విద్యార్థి ఇమ్రాన్‌ఖాన్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బిసి సంక్షేమ సంఘం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ముట్టడిస్తుందని ఆయన హెచ్చరించారు.