కృష్ణ

ఆధార్ లేదా బ్యాంక్ ఖాతాకు మ్యాపింగ్ లేకపోయినా తక్షణం గ్యాస్ సరఫరా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 7: గ్యాస్ కంపెనీలు వారి పరిధిలోని గ్యాస్ వినియోగదారులకు ఆధార్ సంఖ్య లేని యెడల, బ్యాంకు ఖాతాకు మ్యాపింగ్ చేయకపోయినా వారికి గ్యాస్ సరఫరా నిలుపుదల చేయండి అంటూ కలెక్టర్ బాబు ఎ డీలర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సివిల్ సప్లరుూస్ అధికారి వి.రవికిరణ్ ఆధ్వర్యంలో ఐవోసి, హెచ్‌పిసిఎల్, బిపిఎల్ సంస్థల ప్రతినిధులు, గ్యాస్ డీలర్లు, ఏజెన్సీలతో కలెక్టర్ సమావేశమయ్యారు.
జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా లక్షకు పైగా దీపం కనెక్షన్ల లబ్ధిదారులను గుర్తించి గ్యాస్ కనెక్షన్లను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఆధార్ ఆధారితతో కూడి మాత్రమే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. గ్యాస్ ఏజెన్సీలు ఈ విషయంలో నిర్లిప్త్ధోరణి చూపడంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ ఎనేబుల్ చెల్లింపుల విధానంలో ఇప్పటికే దేశానికే కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో 46 వేల మంది గ్యాస్ ఖాతాదారులు 3 ఏజెన్సీల పరిధిలో ఆధార్ సంఖ్య లేకపోవడం, ఉన్నా, బ్యాంకు ఖాతాకు జత చేయకపోవడం గుర్తించామన్నారు. సబ్సిడి ఉన్నా, లేకపోయినా ప్రతి వినియోగదారుకు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను మ్యాప్ చేయాలని తెలిపారు. ఒకే అంశాన్ని పదే పదే గుర్తు చేయడం, చేసిన అమలులో చొరవ చూపకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు.
మే 10న జాతీయస్థాయిలో డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్‌పై న్యూఢిల్లీలో జరిగే సమావేశంలో ఒక సభ్యునిగా పాల్గొంటున్నానని కలెక్టర్ తెలిపారు . ఇందుకోసం ఆహ్వానాన్ని అందుకున్నానని, జిల్లాలో నూతనంగా జారీ చేసి అందిస్తున్న ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్య మ్యాపింగ్ తప్పనిసరిగా ఈ విషయాలు మరో మరో ఆలోచనకు తావేలేదని తెలిపారు. ప్రతి డీలరు వారి పరిధిలోని గ్యాస్ వినియోగదారుని ఆధార్ సంఖ్యను, బ్యాంక్ ఖాతాతో లింకు చేయబడిందో లేదో తెలుసుకోవడం చాలా సులువు అన్నారు. ఒక యస్‌ఎమ్‌ఎస్ పంపడం ద్వారా మరియు ఆన్‌లైన్‌లో ఆధార్ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా గుర్తించ గలుగుతామన్నారు. *99*99 హాష్ సంఖ్యను సెల్‌ఫోన్‌లో పంపాలని, అనంతరం సంబంధిత ఆధార్ సంఖ్యను కోరడం జరుగుతుందని 12 నెంబర్లు గల ఆధార్ సంఖ్యను తెలపడం ద్వారా ఆ ఆధార్ సంఖ్య ఏ బ్యాంకు ఖాతాకు మ్యాప్ చేయబడిందో తెలుసుకోగలుగుతామన్నారు. ఇదే విధానంలో ఆధార్ వెబ్‌సైట్‌లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ యుఐడి డాట్ జివోవి డాట్ ఇన్‌ను వినియోగించుకోవాలని డీలర్లను సూచించారు. దేశానికే కృష్ణా జిల్లా డిబిటిలో ఒక మోడల్‌గా నిలిపామని కలెక్టర్ తెలిపారు.