కృష్ణ

ఘనంగా ఆరుద్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, డిసెంబర్ 26: ధనుర్మాసం శివముక్కోటి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారిని మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని ఆలిండియా రైల్వే రేట్స్ ట్రిబ్యునల్ చైర్మన్ పి దుర్గాప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఏపి ట్రిబ్యునల్ న్యాయమూర్తి సీతారామారావు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్ శివశంకర్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఏసి ఎం శారదాకుమారి ఆధ్వర్యంలో వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ నాగపుట్ట పూజలు, ప్రధాన అర్చకులు బద్దు పవన్‌కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.

ముక్త్యాల వద్ద కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు
జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 26: మండలంలోని ముక్త్యాల కృష్ణానదిలో శనివారం ఉదయం ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సింగారపు కొండ (45) అతని స్నేహితులు రామారావు, శ్రీనులు తెల్లవారుజామున 5గంటల సమయంలో పోటు పడవల్లో నది దాటి గుంటూరు జిల్లా ఒడ్డుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో ఈత వచ్చిన కొండ, శ్రీనులు నదిని ఈదు కుంటు దాటాలన్న ఉద్దేశంతో వస్తుండగా మధ్యలో కొండ గల్లంతు అయ్యాడు. అతని స్నేహితులు ఇద్దరు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకి దొరకలేదు. విషయం గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు తెలిసి నది ఒడ్డుకు చేరి గాలింపు చర్యలు చేపట్టారు. చిల్లకల్లు ఎస్‌ఐ షణ్ముఖ సాయి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లచే గాలింపు చర్యలు చేపట్టినా ఇంత వరకూ ఆచూకి లభించలేదు. గల్లంతు అయిన కొండకు భార్య, ఇద్దరు సంతానం ఉండగా కుటుంబ సభ్యులు, బంధువులు నది ఒడ్డుకు చేరుకొని విలపించారు.