కృష్ణ

మేయర్ రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: మహిళలకు రక్షణ కల్పిచాలని, కీచక పర్వం నడుపుతున్న తెలుగుదేశం కార్పొరేటర్లను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా కార్పొరేషన్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా సంఘాల నేతలను, కార్యకర్తలను నగర మేయర్ అరెస్టు చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తూ శనివారం రాత్రి సిపిఐ, సిపియం, సిపిఐ (ఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస స్టేషను వద్ద ధర్నా జరిగింది. వామపక్ష పార్టీల నేతలు స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి మేయర్, పోలీసుల అనుచిత వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎసిపి, ఇన్‌ఛార్జి సిఐలతో కూడిన బృందం స్టేషనుకు చేరుకుని వామపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపే నేపథ్యంలో నేతలకు పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు భవిష్యత్ కాలంలో పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎసిపి హామీనిచ్చిన దరిమిలా వామపక్ష నేతలు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కార్యకర్తల నుద్దేశించి సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు, న్యూడెమొక్రసీ నాయకులు పోలారి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గ్భావాని మాట్లాడుతూ విహార యాత్రలకు వెళ్లిన కార్పొరేటర్లు తప్పతాగి మహిళల పట్ల కీచకుల్లా ప్రవర్తించినా వారిని అరెస్టు చెయ్యాల్సిన బాధ్యతను పోలీసు శాఖ విస్మరించి తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరినా మహిళా సంఘాల నేతలను దుర్మార్గమైన రీతిలో ఈడ్చుకెళ్లి అరెస్టు చెయ్యటాన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నగర మేయర్ రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, మహిళల పట్ల కీచకుల్లా ప్రవర్తించిన కార్పొరేటర్లను కౌన్సిల్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి డి.కాశీనాధ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, నగర కార్యవర్గ సభ్యులు వడ్డే మహేష్, ఎఐటియుసి నాయకులు బుద్దె రాజా, శాఖ కార్యదర్శులు కంచర్ల నాగేశ్వరరావు, సమితి సభ్యులు మూలి సాంబశివరావు, మహిళా నాయకులు జి.లీలా, మూలి ఇందిర, విద్యార్థి నాయకులు భువన్‌చంద్, షహీన్ షా, యువజన నాయకులు లోకేష్‌బాబు, సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు, విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో మహిళా సమాఖ్య నగర అధ్యక్షులు ఓర్సు భారతి, ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, మహిళా నాయకుడు మైనంపాటి సుబ్బలక్ష్మి, పి.రావు, దుర్గాసి రమణమ్మ, నాంచారమ్మ, ఐద్వా నగర కార్యదర్శి శ్రీదేవి, సి.ఓ.డబ్ల్యు నాయకులు పద్మ తదితరులు ఉన్నారు.

మరణించిన తండ్రి సంతకం ఫోర్జరీ కేసు
గృహిణిని గృహ నిర్బంధానికి గురి చేశారంటూ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ హడావుడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 14: తండ్రి మరణించిన 15 ఏళ్ల వరకు ఫోర్జరీ సంతకాలతో అన్నలను నిలువునా వంచించిన తమ్ముడు... శీర్షికన ఆంధ్రభూమిలో ఈ నెల 12వ తేదీ ప్రచురితమైన వార్తా కథనంకు సంబంధించి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగసాగింది. ఒకవైపు పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రతిష్ఠాకరంగా తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి హఠాత్తుగా శనివారం రంగ ప్రవేశం చేయటం నగరంలో కలకలం సృష్టించింది. సిద్ధార్థనగర్‌లో నివసిస్తున్న కొల్లిపర ముచ్చికోటయ్యతో పాటు అతని భార్య భారతిని పెద్ద సోదరులు ఇరువురూ అదే ఇంట్లో అక్రమంగా నిర్బధించారంటూ అందిన సమాచారంపై రాజకుమారి ఉరుకులు పరుగులతో మధ్యాహ్నం ఒకసారి వెళ్లారు. అదే ఇంట్లో సోదరులు పాండురంగారావు, గోపాలరావు కూడా ఉంటున్నారు. ఆ ఇల్లు తన తండ్రి వెంకట పద్మనాభంకు సంబంధించినదని వారు చెబుతున్నారు. మొత్తంపై ఆ అమ్మలకు సంబంధించిన వివాదం పటమట పోలీస్ స్టేషన్‌లో గత ఆరేళ్లుగా విచారణలో ఉంది. అయితే రాజకుమారి మాత్రం పెద్ద సోదరులిరువురిని బైటకు పంపించాలంటూ పోలీస్ అధికారులను ఆదేశించగా అది ప్రైవేట్ వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకోబోమంటూ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే రాజకుమారి సాయంత్రం మరోమారు ఆ ఇంటికెళ్లి హడావుడి చేయడం మరిన్ని విమర్శలకు గురికావల్సి వచ్చింది. ఒక ప్రజా ప్రతినిధి ప్రోద్బలంపైనే ఆమె ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.