కృష్ణ

విజయవాడ - మచిలీపట్నం 4 లైన్ల జాతీయ రహదారి పుష్కరాల నాటికి పూర్తి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: విజయవాడ - మచిలీపట్నం నాలుగు లైన్ల రహదారి మార్గంలో 3.5 కోట్ల మంది ప్రజలకు సౌకర్యవంతమైన కంకిపాడు ప్రాంతంలోని పనులను ఎట్టి పరిస్థితుల్లో పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాల్సిందేనని కలెక్టర్ బాబు ఎ స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు కఠినంగా ఉండగలవని హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ చాంబర్‌లో సోమవారం విజయవాడ - మచిలీపట్నం 64 కిలో మీటర్ల మేర నిర్మించాల్సిన 4 మార్గాల రహదారి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంలో కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాడ్డాక రాజధాని నిర్మాణంలో భాగంగా రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. దుర్గాఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా కేవలం 20 రోజుల్లోనే భూసేకరణ చేపట్టి ఆ ప్రాంతంలోని నిర్మాణాలను తొలగించి నిర్మాణ కంపెనీకి అందించడం జరిగిందని ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గట్కారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారన్నారు. ఈ 4 లైన్ల రహదారు పనులను దిలిప్ బిల్డ్‌కాన్ సంస్థకు అప్పగించామని రహదారుల పనుల కోసం 93 శాతం పైగా భూములను అప్పగించామని మిగిలినవి కూడా వారం రోజుల్లోగా అందజేయడం జరుగుతుందన్నారు. దిలిప్ బిల్డ్‌కాన్ సంస్థ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చేపడుతున్న పనులను పరిశీలించాలని, అదే విధంగా సోమా సంస్థ దుర్గాఫ్లైఓవర్ నిర్మాణాలను పుష్కర ఘాట్లు తదితర అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించి ఉత్తేజం పొందాలని కలెక్టర్ బాబు ఎ అన్నారు. ఈ 64 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో కంకిపాడు ప్రాంతంలో చేపట్టే పనుల ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. ఈ పనుల నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్, ఇసుక సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆమోద ఉత్తర్వుల జారీకి, సరుకు రవాణా మార్గంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నూజివీడు, విజయవాడ సబ్ కలెక్టర్‌తోను, జి కొండూరు, విజయవాడ రూరల్ గన్నవరం, కంకిపాడు, తహశీల్దార్‌లతోను, ఎడి మైన్స్ అధికారులతోను టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించి తక్షణం ఆదేశాలు జారీ చేశారు. మెటల్ కోసం జి కొండూరు పరిధిలోను 47 సర్వే నెంబర్‌లోను, ఇసుక కోసం రొయ్యూరు రీచ్ నుండి ఇసుకను తీసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పెడన, మచిలీపట్నం మున్సిపాల్టీల ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయిన నిర్మాణాల తొలగింపులో అడ్డుగావున్న వాటర్ పైప్‌లైన్ తదితర వౌలిక సదుపాయాల తరలింపునకు సాంకేతికపరమైన అనుమతులలో జాప్యం చూపడంపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్‌లు ఎమ్ గోపాలరావు, జస్వంత్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే హైదరాబాద్ వెళ్లి అనుమతులతో తిరిగిరావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోని సుడాన్, ఎన్‌హెచ్‌ఎఎ ప్రాజెక్టు డైరెక్టర్ టి సురేష్‌కుమార్, దిలిప్ బిల్డ్‌కాన్ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు మేనేజర్ త్యాగాజి, సీనియర్ మేనేజర్ జయకాంత్ ఝా, టి శ్రీనివాసరావు, జాతీయ రహదారి సాంకేతిక మేనేజర్ సిహెచ్ విద్యావాణి తదితరులు పాల్గొన్నారు.