కృష్ణ

అనైతిక కార్పొరేటర్లతో రాజీనామా చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 16: ఎంతో ఘనత వహించిన విజయవాడ నగర పరువు, ప్రతిష్ఠను గంగపాలు చేసి మహిళల పట్ల కీచక పర్వాన్ని కొనసాగించిన టిడిపి కార్పొరేటర్లతో రాజీమానా చేయించి నగర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌ను డిమాండ్ చేసారు. సోమవారం ఉదయం విఎం సి ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన నిరసన ధర్నాలో వారు మాట్లాడుతూ ఆరోపణలే కాకుం డా మహిళలచే ఫిర్యాదులెదుర్కొన్న కార్పొరేటర్‌ను వెనకేసుకొస్తున్న మేయ ర్ శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావుల వైఖరి సిగ్గుచేటన్నారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలనలో అనేక కుంభకోణాలు, అవినీతి చర్యలు పెచ్చురిల్లుతున్నాయన్నారు. అవినీతి సొమ్ములతో కళ్లు మూసుకుపోయిన టిడిపి కార్పొరేటర్లు కామాంధులా తయారవుతున్నారని విమర్శించారు. కార్పొరేటర్ కీచకపర్వంపై మేయర్ నిసిగ్గుగా సమర్థించుకుంటూ విపక్షాలపై విమర్శలకు దిగుతున్న వైనం శోచనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం మహిళల అభ్యున్నతిపై మాట్లాడుతున్న మాటలు నీటి మూటలేనని, రాజధాని నగరంగా చెప్పుకొంటున్న టిడిపి పెద్దలు నగర కార్పొరేటర్‌పై వచ్చిన ఆరోపణలే కాకుండా ఫిర్యాదులనైనా పరిగణలోకి తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. తక్షణమే ప్రత్యేక కౌన్సిల్‌ను నిర్వహించి ఆయా కార్పొరేటర్లను కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లను విచారించడంతోపాటు అధ్యయన యాత్ర పేరిట విహార యాత్ర జరిపించిన యాత్రా ఇన్‌చార్జ్ ఆఫీసర్ ఇఇ ఉదయకుమార్‌పై కూడా తగు చర్యలు తీ సుకోవాలన్నారు. మద్యం కేసు, మహిళల వేధింపుల కేసులను ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలను, నాయకులను విమర్శించే నైతికత లేదన్నారు.