కృష్ణ

పిన్నమనేనికి చంద్రబాబు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మే 18: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య సాహిత్యవాణిని పోగొట్టుకున్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పరామర్శించారు. పిన్నమనేని స్వగ్రామం నందివాడ మండలం రుద్రపాక చేరుకున్న చంద్రబాబు సాహిత్యవాణి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రోడ్డు ప్రమాదంపై వివరాలు పిన్నమనేనిని అడిగి తెలుసుకున్నారు. కారుడ్రైవర్, తన భార్య సాహిత్యవాణి సీటుబెల్ట్ పెట్టుకోక పోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని, కార్లలో ప్రయాణిస్తున్న వారందరూ విధిగా సీటుబెల్ట్ పెట్టుకోవాలనే నిబంధనను అమలు చేయాలని పిన్నమనేని ముఖ్యమంత్రిని కోరారు. సాహిత్యవాణి మృతి పట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. పిన్నమనేని కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ బాబు.ఎ, ఎస్పీ విజయ్‌కుమార్, తదితరులు ఉన్నారు. పిన్నమనేనిని పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కాగిత వెంకట్రావు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి బాలవర్ధనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి, పేర్ని నాని, జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, తదితరులు ఉన్నారు.