కృష్ణ

పిన్నమనేని కుటుంబానికి టిడిపి అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మే 18: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం నందివాడ మండలం రుద్రపాకలో పిన్నమనేని వెంకటేశ్వరరావును పరామర్శించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. భార్యను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పిన్నమనేనికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని దేవుడు కలుగజేయాలని ప్రార్థించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాహిత్యవాణి, డ్రైవర్ దాస్‌ల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. కార్లలో ప్రయాణించే వారంతా సీటుబెల్ట్ పెట్టుకోవడం ఒక పాఠంగా తీసుకోవాలని సూచించారు. పిన్నమనేని కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని, ఇదే కారులో ఉన్న పిన్నమనేని సీటుబెల్ట్ పెట్టుకోవడం వల్ల ఘోర ప్రమాదం నుండి తప్పించుకోగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

జిల్లా కాంగ్రెస్ నేత
నాగేశ్వరరావు దారుణ హత్య
తిరువూరు, మే 18: జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అక్కపాలెంకు చెందిన దోమతోటి నాగేశ్వరరావు(47) మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామం ప్రారంభంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ట్యాంక్ వద్ద నీటి మడుగులో ఆయన మృతదేహం పడిఉండగా బుధవారం వేకువఝామున గ్రామస్తులు కనుగొన్నారు. మంగళవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆయన ఉదయం శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ట్యాంక్ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దోమతోటి వెంకటరమణ అక్కపాలెం సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు గతంలో గ్రామ వార్డు మెంబర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన ఆయన కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పలు కీలక పదవులు అలంకరించారు. ఇంటికి వెళుతుండగా దుండగులు ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి దాడి చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముఖం, మెడ, తల, చేతులు, పొట్టపై తీవ్రంగా నరికిన గాయాలున్నాయి. ఆయనను చంపి మృతదేహాన్ని నీటి గుంటలో వేసి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. మృతుడి ద్విచక్ర వాహనం మైలవరంలో లభించిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో తిరువూరు - పెరువంచ రహదారిలో కిలోమీటరు పొడవునా రక్తపు మరకలు ఉన్నాయి. వాటిని నూజివీడు సబ్ కలెక్టరు లక్ష్మీశ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. సబ్ కలెక్టరు లక్ష్మీశ, నూజివీడు డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు ఎం కన్నప్పరాజు, పరమేశ్వరరావు, తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎపి మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎఎంసి చైర్మన్ తాళ్ళూరి రామారావు, ఎంపిపి గద్దె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు దేవినేని అవినాష్, పరసా రాజీవ్ రతన్, పల్లెపాటి శ్రీనివాసరావు, తాటిశెట్టి పూర్ణచంద్రరావు, వైకాపా నాయకులు శీలం నాగనర్సిరెడ్డి, చలమాల సత్యనారాయణ, సిపిఎం, సిపిఐ , టిడిపి, బిజెపి నాయకులు ఎం ప్రభాకరరావు, ఎస్‌వి భద్రం, కొత్తపల్లి సుందరరావు, డి మహేష్, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త పమ్మి రామారావు, తదితరులు నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగేశ్వరరావు హత్య ఉదంతం తిరువూరులో తీవ్ర సంచలనం రేపింది. పెద్దసంఖ్యలో పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.