కృష్ణ

21న టిడిపి మినీ మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 18: ఈ నెల 22న నిర్వహించాల్సిన తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడును ఒకరోజు ముందుగా 21న నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఒకరోజు ముందుగా మినీ మహానాడును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం సుల్తానగరంలోని శ్రీరామరాజు కనె్వన్షన్ సెంటరులో ఉదయం 10గంటలకు మినీ మహానాడు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు.

టిడిపి, బిజెపి మధ్య విభేదాలకు
తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల కుట్ర
* ఎమ్మెల్యే కాగిత ధ్వజం
పెడన, మే 18: టిడిపి, బిజెపి మధ్య విభేదాలు సృష్టించి రాష్ట్రంలో పబ్బం గడుపుకోవాలని తల్లి, పిల్ల పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ కాగిత వెంకట్రావ్ విమర్శించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎఎంసి చైర్మన్ గుడిశేవ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు టిడిపి నాయకులు అనేక స్థానిక సమస్యలను ప్రస్తావించారు. జిల్లా కమిటీ నుండి అందిన ఎనిమిది అంశాలపై చర్చ జరగ్గా స్థానికంగా గుర్తించిన ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈసందర్భంగా గుడిశేవ రామారావు మాట్లాడుతూ కాపు సంక్షేమం రాష్ట్రంలో నీరుగారుతోందన్నారు. పెడన నియోజకవర్గంలో 850 దరఖాస్తులు కాపు రుణాల కోసం రాగా బ్యాంక్‌లు కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు ఇచ్చాయన్నారు. గూడూరు జెడ్పీటిసి గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించని కుటుంబాల రేషన్ కార్డులను రద్దు చేయాలన్నారు. కృత్తివెన్ను జెడ్పీటిసి ఒడుగు తులసీరావు మాట్లాడుతూ మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. జన్మభూమి కమిటీల పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మ చైర్మన్ చలం మాట్లాడుతూ కోతలు కోయకముందే ధాన్యం బోనస్ ప్రకటించాలని కోరారు. గూడూరు మండలానికి చెందిన డిసి చైర్మన్ పోతన స్వామినాయుడు మాట్లాడుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాగితకు మంత్రి పదవి రాకపోవటం బాధాకరమన్నారు. పాల సంఘం జిల్లా డైరెక్టర్ అర్జా వెంకట నగేష్ మాట్లాడుతూ వర్షాలు పడకముందే కాలువలను తవ్వించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పూలబాబు మాట్లాడుతూ పెడన టిడిపిలో చీలిక తేవాలని కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసినప్పటికీ పంపిణీ కాకపోవటాన్ని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు డొక్కా జగన్నాథం, ఎఎంసి చైర్మన్ వాటాల నరసింహస్వామి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న, ఎమ్మెల్యే కాగిత కుమారుడు కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.