కృష్ణ

నగరమంతా యుజిడి వినియోగం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 28: రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలోని అన్ని గృహాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని ఆ దిశగా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ విఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నగరానికి విచ్చేసిన మంత్రి నారాయణ లబ్బీపేట రిజర్వాయర్ ఆవరణలో నగరంలో అందుబాటులో ఉన్న యుజిడి సౌకర్యంపై విఎంసి కమిషనర్ వీరపాండియన్‌తోపాటు సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ యుజిడి ని అమలుచేయగలిగిన అవకాశం ఉన్నా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నగరం సమగ్ర అభివృద్ధి చెందాలంటే అన్ని గృహాలకు యుజిడి సౌకర్యం అందుబాటులో ఉండాలని, ఇందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని అయినా సరే సత్వరమే కనెక్షన్లను మంజూరు చేయాలని తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు కింద 465 కోట్ల డ్రైయిన్ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, ఇందుకు త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నగరం వర్షం నీటి ముంపుతోపాటు కృష్ణా, బుడమేరు వరదల ముంపుల నుంచి పరిరక్షించేందుకు నిర్మిస్తున్న సైడ్ డ్రైయిన్లన్నీ కేవలం స్ట్రామ్ వాటర్ పారుదలకే వినియోగం కావాలని, గృహాల నుంచి వెలువడే వాడుక నీరంతా యుజిడి నుంచే పారుదల అవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లతోపాటు ఇంకా లక్షా 25వేల గృహాలకు యుజిడి కనెక్షన్లను ప్రజలు తీసుకోవాల్సి ఉందని, ఈవిషయంలో ప్రజలకు తగు అవగాహన కల్పించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా విఎంసి కమిషనర్ వీరపాండియన్ నగరంలో ఉన్న యుజిడి పరిస్థితులను మంత్రి నారాయణకు వివరిస్తూ నగర వ్యాప్తంగా ప్రాథమిక సర్వే నిర్వహించి ఇంటింటికీ యుజిడి కనెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకొంటామన్నారు. యుజిడికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్లను విఎంసి మొబైల్ ఆప్ ద్వారా నమోదు చేసుకొనే అవకాశాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, విఎంసి ఇన్‌చార్జ్ సిఇ ఎంఎ షుకూర్, ఎస్‌ఇ పి ఆదిశేషు, ఇఇ నగేష్‌బాబు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పనితీరు అభినందనీయం: జపాన్ బృందం
గన్నవరం, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించిన జపాన్ బృందం ప్రభుత్వ పనితీరును అభినందించారు. అమరావతిలో పర్యటించిన జపాన్ గవర్నర్, ప్రతినిధుల బృందం తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనులపై విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను జపాన్ బృందం తిలకించింది. రాష్ట్రంలోని రైతులకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.16వేల కోట్లతో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును నిర్మించినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ జపాన్ బృందానికి వివరించారు. ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయని 2018 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసేందుకు రూ.1,230 కోట్ల ఖర్చుతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేసినట్లు కలెక్టర్ వివరించారు. వచ్చే ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా లభించే అవకాశం వుందన్నారు. ప్రాజెక్టుల ప్రగతిని పరిశీలించిన జపాన్ బృందం ప్రభుత్వ పనితీరును అభినందించింది. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకున్న జపాన్ ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా జపాన్ గవర్నర్ తకరాజు ఇషి తదితరులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ సృజన, నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీషా, గన్నవరం తహశీల్దార్ ఎం.మాధురి, తదితరులు జపాన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం నుండి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి తరలివెళ్లారు.