కృష్ణ

తెలుగు భాషకు పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మే 31: తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన సమయంలో తెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ ఉద్యమంలో మంచి స్ఫూర్తితో కృషి చేయాలని తెలుగు భాషా ప్రేమికులు, కవులు, సాహితీ వేత్తలు అభిలషించారు. అధునిక పోకడలు సమాజాన్ని శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష అవశ్యకతను, ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బాధ్యతను ప్రభుత్వంతో పాటు అందరూ తీసుకోవాలని, ముఖ్యంగా ఈ విషయంలో యువత ముందుండి నడిపించాలని వారు సూచించారు. విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్‌టిఆర్ ట్రస్ట్ సంయుక్త భాగస్వామ్యంలో మంగళవారం బందరు రోడ్డులో ఉన్న శేషసాయి కళ్యాణ మండపంలో తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ షష్టి పూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో తెలుగు భాష - సంస్కృతుల పరిరక్షణ, తెలుగులోనే పరిపాలన, తెలుగు బోధన, సంగీతం, నృత్యం, చిత్రకళ, శిల్పకళ ఇతర తెలుగు సంప్రదాయ కళలకు పునరుజ్జీవం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రముఖులు చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేష్ మాట్లాడుతూ నేటి తరం తెలుగును మర్చిపోయే పరిస్థితులకు వచ్చిందని, తెలుగుకు గత వైభవం తీసుకువచ్చేందుకు అందరూ నడుం బిగించాలన్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను సాహితీవేత్తలు, కవుల నుండి స్వీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించనున్నట్లు చెప్పారు. ఇటువంటి సమ్మేళనాలను మునుముందు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ కవి, నటుడు, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది అన్న ఎన్టీఆర్ అన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, దీనికోసం సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తెలుగు భాష పరిరక్షణకు నిబద్ధతతో ముందుకు రావాలన్నారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు అత్మ విశ్వాసంతో పనిచేయాలన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలలోనే మన సంస్కారం ముడిపడి ఉందన్నారు. మన భాషా ఔన్నత్యాన్ని దేశ దేశాలు గౌరవిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కవులు రచించిన పుస్తకాలను ప్రముఖులు అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఐ వెంకయ్య, సుద్దాల అశోక్ తేజ, పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, ఎన్‌టిఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

టిడిపి హయాంలో సంక్షేమ పథకాలకు తిలోదకాలు

మైలవరం, మే 31: ప్రజాసంక్షేమ పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం పంగనామాలు పెట్టి పేదలకు తీరని ద్రోహం చేసిందని పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మైలవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలతో మమేకమై ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై వారి నుండి వివరాలు సేకరించారు. తమకు పెన్షన్ రావటం లేదని, రుణమాఫీ లేదని, నిరుద్యోగ భృతి లేదని, ఇంటికో ఉద్యోగం ఊసే లేదని పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ ఆరోపించారు. దీనిపై రఘువీరారెడ్డి స్పందిస్తూ ప్రజాసంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అర్హత కలిగిన వారికి పెన్షన్లు ఇవ్వట్లేదని, రేషన్‌కార్డులు తొలగించారని, ఇందిరమ్మ ఇళ్ళ బకాయిలు ఇంతవరకూ ఇవ్వలేదని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత వరకూ కొత్త ఇల్లుగానీ, అర్హత కలిగిన వారికి గజం స్తలం ఇవ్వటం గానీ లేదని ఆయన వివరించారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, రైతు రుణ మాఫీ చేస్తానని, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల చొప్పున ఇస్తానని, ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయించి తామే ఇళ్ళను నిర్మించి ఇస్తామని అనేక హామీలిచ్చి అన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలను వంచనకు గురి చేసిందని ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. గ్రామాలలో ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా జన్మభూమి కమిటీ కనుసన్నలలోనే అమలవుతున్నాయని ధ్వజమెత్తారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాల పనితీరుపై గ్రామం యూనిట్‌గా తీసుకుని అమలు తీరుపై పిసిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలను ప్రజలముందుంచి ప్రభుత్వ తీరును ఎండగడతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు అప్పసాని సందీప్, దేవినేని అవినాష్, కటారి ఉమామహేశ్వరరావు, బొర్రా కిరణ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు మధ్య ముక్త్యాలలో ఆక్రమణల తొలగింపు

జగ్గయ్యపేట రూరల్, మే 31: మండలంలోని ముక్త్యాల గ్రామంలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని పూర్తి స్థాయిలో ఆక్రమణల తొలగింపునకు అధికార యంత్రాంగం ఉపక్రమించారు. జిల్లా కలెక్టర్ బాబు ఎ తోపాటు ఆదివారం గ్రామంలో పరిశీలనకు వచ్చిన సబ్ కలెక్టర్ సృజన శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం ముందు గల షాపులను పూర్తిగా తొలగించి రోడ్డును విశాలంగా చేయాలని ఇచ్చిన వౌఖిక ఆదేశాలతో సోమవారం రాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. గ్రామ సమీపంలోని సిమెంట్ కర్మాగారానికి చెందిన ప్రతినిధులు తమ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ఆక్రమణల తొలగింపు స్వయంగా చేసుకోవాలని అధికారులు అవకాశం ఇచ్చినప్పుటికీ పరిశ్రమకు చెందిన వారు పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో అధికారులపై అగ్రహం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ 48 గంటల్లోగా తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో సిఐ లచ్చునాయుడు, సర్కిల్ పరిధిలోని చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి ఎస్‌ఐలు, భారీ ఎత్తున సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆక్రమణల తొలగింపుకు ఎలాంటి ప్రతిఘటన లేకుండా మోహరించారు. జగ్గయ్యపేట తహశీల్దార్ అనిల్ జన్నిసన్, ఎండిఒ జయచంద్ర, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు దగ్గర ఉండి జెసిబిలు ఏర్పాటుచేసి ఆలయం ముందు ఉన్న షాపులను రాత్రి 10గంటల నుండి తెల్లవారుజాము వరకూ తొలగించారు. అధికారులు తీసుకున్న నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.