కృష్ణ

ప్రజలను విస్మరిస్తే పుట్టగతులుండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 4: నేను రాగానే నా పక్కన చేరి ఫొటోలకు ఫోజులిస్తే ప్రజలు విశ్వసించరు, ప్రజలు ఇచ్చిన అవకాశంతో పదవిలోకి వచ్చి వారిపై పెత్తనం చేద్దామంటే కుదరదు,,, బానిసత్వం చేస్తానంటే నేను సహించను,,, ప్రతి పనికీ జవాబుదారితనంగా వ్యవహరించకపోతే రాజకీయంగా పుట్టగతులుండవ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాసేవకు అంకితమైతేనే పూర్తికాలం రాజకీయాలలో ఉండి పదవులను అనుభవిస్తాం, అటువంటి వారికే తాను మద్దతునిస్తా, అటువంటి వారినే ప్రోత్సహిస్తా, రాజకీయ దొంగలకు నావద్ద స్థానం లేదు అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజాప్రతినిధులకు క్లాస్ పీకారు. రిజర్వేషన్ల పుణ్యమా అంటూ అన్ని కులాలు, వర్గాలకు రాజకీయంగా అనేక అవకాశాలు వచ్చాయని వాటిని ప్రజాసేవ చేసి రుణం తీర్చుకోవాలన్నారు. దేవినేని ఉమ ఎక్కడున్నాడనో, చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడనో ఆలోచించవద్దు, మన గ్రామంలో ఏం సమస్యలున్నాయ్, అవి ఎంతవరకు పూర్తి చేశాం, ప్రజలకు ఏం అవసరం, వారి సమస్యలేంటి అనే దాని గురించి ఆలోచించండి దానిపై పని చేయండి చేసిన పనిని గురించి చెప్పుకోండి, ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏం చేస్తుంది, ఏ పధకాలు ప్రవేశపెట్టింది, వాటి అమలు తీరు తెలుసుకుని ప్రజలకు వివరించి, వాటిని సక్రమంగా అమలు చేయించండి అప్పుడే ప్రజాప్రతినిధిగా పదవికి సార్థకత చేకూర్చినట్లు అవుతుంది అంటూ మంత్రి ఉమ ప్రజాప్రతినిధులనుద్దేశించి అన్నారు. పదవిని చూసుకుని మురిసి పోవద్దని, పదవి ద్వారా నలుగురికి సేవ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఇప్పటికే ఎక్కువ శాతం మంది ప్రజాప్రతినిధులకు తెలియకపోవటం బాధాకరమన్నారు. ముందు సంక్షేమ పధకాలు తెలుసుకోండి అవి సక్రమంగా అమలు జరిగేలా అధికారులతో మాట్లాడండి, ఆ పథకాలు అర్హత కలిగిన వారికి చేరే విధంగా కృషి చేయండంటూ కొంత మందలింపుధోరణితో పేర్కొన్నారు. దీంతో వేదికపై, వేదిక కింద ఉన్న ప్రజాప్రతినిధులు విస్తుబోయారు. త్వరలో తాను నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటిస్తా, ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు ఏం సేవలు చేశారనే విషయంపై ప్రజలతోనే చెప్పిస్తా, బాగా పని చేయని వారి గురించి ప్రజలలోనే ఎండగడతా అని హెచ్చరించారు. ఇప్పటి నుండైనా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి అని ఉమ సూచించారు. ఉమ మాటలు, ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దాదాపు గంటన్నర సేపు తన మాటలతో అందరికీ చురకలు అంటించారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు బానిస అని వారికి తేల్చి చెప్పారు.

జిల్లాలో గాలివాన బీభత్సం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జూన్ 4: నైరుతి ఋతుపవనాల కదలికల నేపథ్యంలో శనివారం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుఝాము నుండి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు భీతిల్లారు. వర్షంతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీయటంతో భారీ వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ కృష్ణాలో చిరుజల్లులు పడగా తూర్పు కృష్ణాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 37.5 మి.మీలుగా నమోదైంది. అత్యధికంగా పామర్రులో 125.2 మి.మీలు, అత్యల్పంగా వీరుళ్ళపాడులో 1.6 మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం, దివిసీమ, పెడన, పామర్రు, మొవ్వ, గుడ్లవల్లేరు, తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. దీనికితోడు విస్తారంగా వీచిన ఈదురుగాలుల కారణంగా ప్రధాన కూడళ్లలోని హోర్డింగ్‌లు పడిపోయాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరగటంతో కొంతమేర ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు పడిపోవటం, వైర్లు తెగిపోవటంతో పాటు పిడుగుపాటుకు పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫారాలు మాడిపోయినట్లు సమాచారం. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో అంధకారం నెలకొంది. ట్రాన్స్‌కో అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. భారీగా కురిసిన వర్షానికి ప్రధాన రహదార్లు నీటితో నిండిపోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఖరీఫ్ రైతులకు ఈ వర్షం కొంత ఊరటనివ్వగా మామిడి రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల వల్ల దివిసీమలో మామిడికాయలు రాలిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం మచిలీపట్నం పూర్తిగా జలమయమైంది. ప్రధాన రహదార్లలో మోకాలు లోతు నీళ్లు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అలాగే చెరువును తలపించేలా తయారైన బందరు బస్టాండ్‌లో ప్రయాణికులు ఈదాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి చిన్న వర్షానికి తటాకంగా మారే బస్టాండ్ ఈ భారీ వర్షానికి పూర్తిగా నీట మునిగింది. పట్టణ ప్రధాన కూడలి కోనేరు సెంటరు సముద్రాన్ని తలపించింది. కోనేరు స్థూపాన్ని వర్షపునీరు చుట్టుముట్టడంతో చిరువ్యాపారాలు పూర్తిగా బంద్ అయ్యాయి.