కృష్ణ

ఈ-పొస్ ద్వారా ఎరువుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 5: దేశంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ నుండి ఎరువులను 110 షాపుల్లో ఈపోస్ విధానం ద్వారా రైతులకు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సబ్సిడీ ఎరువులను నూతన సాంకేతిక పరిజ్ఞానం ఈపోస్ ద్వారా దేశంలోనే తొలిసారిగా 110 షాపుల్లో అమలుచేసి సరఫరా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జూలై చివరి నాటికి 149 రూపాయలకే ఫైబర్ కనెక్టివిటీ అన్ని గ్రామాల్లో కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 60ఏళ్ల వయస్సులో కూడా ముఖ్యమంత్రి 18 గంటలకు పైగా కష్టపడుతున్నారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని 24 గంటలు పనిచేయాలని కోరారు. 16వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. భూగర్భ జల మట్ట స్థాయిలో ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకునే విధంగా సిఎం కోర్ డేష్ బోర్డ్ ఉంచామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో జిల్లాలో గత సంవత్సరం 86కోట్ల రూపాయల పనులు జరిగాయని ఈ సంవత్సరం 116 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలో లక్షా 40వేల భూసార పరీక్షలు నిర్వహించామని వీటిలో 60 శాతానికి పైగా ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచి భూసార పరీక్షల కార్డులను అందజేశామన్నారు. కృష్ణాజిల్లాలో ప్రయోగాత్మకంగా 20 షాపుల్లో ఈపోస్ విధానంలో ఎరువులను రైతులకు అందించామని తద్వారా 80 శాతం రైతులు సద్వినియోగం చేసుకున్నారన్నారు.