కృష్ణ

సిఎం లక్ష్యానికి చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 5: రేయనకా, పగలనకా కష్టపడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అందరూ చేయూత నందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆదివారం ఆయన స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో రైతులు, నీటి సంఘాల నేతలతో ఆయన సమావేశమై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే బాబు సంకల్పంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండకుండా సాగునీటిని అందించటానికి పెండింగులోని ప్రాజెక్టులన్నింటినీ నిర్మించాలన్న ధ్యేయంతో జలవనరుల శాఖకు అధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను పరిశీలిస్తూ యుద్ధప్రాతిపదికన వాటిని నిర్మింపజేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 14వేల కోట్ల రూపాయలు ఈశాఖ ద్వారా వెచ్చించినట్లు తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రానికి 16వేల కోట్ల రూపాయలు అప్పున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో పాతిక వేల కోట్ల రూపాయలు వెచ్చించైనా మిగిలిన 40 ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయిలో నిర్మించటమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీటి సంఘాల నేతలు సైతం చంద్రబాబు లక్ష్యానికి చేయూతనందించాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంట తవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో 100కుపైగా ఇంకుడు గుంటలు తవ్వించిన వారినే తాను నేతగా ప్రజల ముందుంచుతానని, తవ్వని నేతలను ప్రజలలో దోషులుగా నిలబెడతానని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్భ్రావృద్ధికి 18గంటల పాటు కష్టపడుతున్న బాబు కృషిని ప్రజలకు వివరించాలన్నారు. అదేక్రమంలో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఉమ మైలవరంలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశవరావు, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, సర్పంచ్ కృష్ణవేణి, ఉపసర్పంచ్ షహానాబేగం, పలు శాఖల అధికారులు, రైతులు, నీటి సంఘాల నేతలు పాల్గొన్నారు.