కృష్ణ

లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు ఆలోచనలే పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూన్ 6: లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలే పెట్టుబడి అని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం స్థానిక పిన్నమనేని కళ్యాణ మండపంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధిపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎరువుల ధరలు పెరగకుండా, కొరత లేకుండా చేశామన్నారు. వచ్చే సార్వా సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 8.90లక్షల క్వింటాళ్ళ విత్తనాలను, 8.50లక్షల క్వింటాళ్ళ ఎరువులను సిద్ధం చేశామన్నారు. భూసార పరీక్షలు, మైక్రో న్యూట్రెంట్స్ తదితర పరీక్షలను చేపట్టి వివిధ రకాల భూముల్లో పండే పంటలకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నామన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో హనుమాన్‌జంక్షన్ వద్ద రూ.2వేల కోట్లతో అశోక్ లేలాండ్ సంస్థ పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చిందన్నారు. వ్యవసాయం, జల వనరులు రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివని, జల వనరులశాఖలో రూ.16వేల కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. పట్టిసీమ నుండి తరలించిన 8టిఎంసీల నీటితో కృష్ణాడెల్టాలో 4లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుకోగలిగామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయాలకు జగన్ అనర్హుడన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోలేరన్నారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటిని కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.