కృష్ణ

వికలాంగ ఉపకరణాలలో సాంకేతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 6: అర్హులైన మూగ, చెవిటి వారికి టచ్ ఫోన్‌లు.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ వికలాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ సైకిల్స్.. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యాటరీ ఆపరేట్ సైకిల్స్.. అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (కార్పొరేషన్) ప్రణాళికలు తయారు చేస్తోంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు భారీగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని కార్పొరేషన్ ద్వారా సాధారణ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ కాకుండా సాంకేతికను జోడించి టచ్ ఫోన్‌లు, మోటారైజ్డ్, బాటరీ ఆపరేటింగ్ సైకిల్స్‌లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాజిల్లాకు సంబంధించి వికలాంగుల కార్పొరేషన్‌కు రూ.83లక్షల 64వేల 328లు బడ్జెట్ కేటాయింపు జరిగింది. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా కూడా వికలాంగ విద్యార్థులు, వికలాంగ దంపతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా నిధుల కేటాయింపు భారీగా జరిగింది. జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.3కోట్ల 16లక్షల 20వేలు కేటాయించారు. వికలాంగ విద్యార్థులకు ఫ్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్, స్వయం ఉపాధి కొరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. వికలాంగ వివాహ ప్రోత్సాహకాలుగా కోటి 53లక్షలు ఇవ్వనున్నారు. మొత్తం 306 జంటలను ఎంపిక చేయనున్నారు. స్వయం ఉపాధి హామీ పథకం కింద 193 మంది లబ్ధిదారులకు రూ.80లక్షలు అందించనున్నారు. 1 నుండి 10వ తరగతి వరకు చదివే 844 మంది విద్యార్థులను గుర్తించి రూ.9.90లక్షలు ఫ్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లుగా ఇవ్వనున్నారు. అలాగే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 155 మందికి రూ.20,30లక్షలను అందించనున్నారు. ఇంటర్, డిగ్రీ, పిజి కోర్సు చేసే వికలాంగ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. ఇక వికలాంగ కార్పొరేషన్ ద్వారా 16 సంవత్సరాల పైబడిన 64 మంది మూగ, చెవిటి వారికి 64 టచ్ ఫోన్‌లు ఇవ్వనున్నారు. అలాగే పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ చేసే వికలాంగ విద్యార్థులకు యూనిట్ విలువ లక్ష రూపాయలతో 50 మందికి మోటరైజ్డ్ ట్రై సైకిళ్ళు ఇవ్వనున్నారు. 16-18 సంవత్సరాల వయస్సు కలిగి పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివే 16 మంది విద్యార్థులకు బ్యాటరీ ఆపరేటింగ్ సైకిల్స్‌ను అందిస్తారు. మరో 16 మంది అంధ విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందిస్తారు. ఇవిగాక సోలార్ బేస్డ్ వీల్ చైర్స్‌ను అందించనున్నారు.
అర్హులందరికీ లబ్ధి
జిల్లాలో అర్హులైన వికలాంగులందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆ శాఖ ఎడి ఎవిడి నారాయణరావు సోమవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం సాంకేతికత కలిగిన ఉపకరణాలు అందించేందుకు నిధుల కేటాయింపు చేసిందన్నారు. సాంకేతిక ఉపకరణాలతో పాటు ప్రతి ఏడాది ఇచ్చే విధంగా వీల్‌చైర్స్, ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, బెయిలీ బుక్స్ తదితర ఉపకరణాలను కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా తుమ్మలపల్లి కళా క్షేత్రం

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 6: నగరంలోని నగర పాలక సంస్థకు చెందిన తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కళాక్షేత్రం ఆధునీకరించే పనులను సోమవారం ఉదయం పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. హాల్లో మంచి సౌకర్యవంతమైన కుర్చీలు, సీలింగ్, రూఫ్ సీలింగ్ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే కళాక్షేత్రం ముందు భాగాన్ని సంస్కృతికనుగుణంగా వివిధ ఆకృతులను ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన ఆయా పనులను పూర్తి చేయాలని సూచించారు. కళాక్షేత్రం ఆవరణ మొత్తం గ్రీనరీతోపాటు ఆకర్షణీయమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో విఎంసి సిఇ ఎంఎ షుకూర్, ఇఇ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.