కృష్ణ

క్షణక్షణం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: ఉదయం 10.30 గంటలు.. విజయవాడ మధురానగర్ వద్ద విపరీతమైన ట్రాఫిక్.. ఇంతలోనే ఆ మార్గంలో ఉన్న రైల్వే గేటు మూసుకుంది. మధురానగర్ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం ప్యాసింజర్ రైలు ఆగింది. రైలు గేటుకు ఇరుపక్కలా వాహనాలు బారులుతీరి నిలబడ్డాయి. ఇంతలో స్టేషన్ నుంచి రైలు బయలేరి నెమ్మదిగా ముందుకు కదులుతోంది. ఆ గేటుకు ఇరుపక్కలా బారులు తీరిన వాహనాల్లోంచి ఒక్కసారిగా కలకలం మొదలైంది. వాహనాలు విడిచిపెట్టి చాలా మంది రైలు పట్టాల మీదికి పరుగులు తీస్తున్నారు. ఏంటని అందరూ ఆ వైపుగా చూశారు. ఓ 50 ఏళ్ల మహిళ రైలు పట్టాపై తలపెట్టి పడుకుని ఉంది. ఓ పక్క రైలు ఆమెను సమీపిస్తోంది. దూరం నుంచి ఆమెను చూసిన జనం అక్కడికి చేరుకోడానికి కొద్ది క్షణాలు పడుతుంది. ఇంతలో రైలు డ్రైవర్ మేల్కొన్నాడు. దూరంలో పట్టాలపై ఉన్న మహిళను చూసి రైలు ఆపే ప్రయత్నం చేశాడు. పట్టాలపై ఉన్న మహిళ దగ్గరకు దాదాపు రైలు సమీపించి ఆగుతోంది. ఇంతలో జనం ఆ మహిళ దగ్గరకు వెళ్లి బలవంతంగా ఆమెను పట్టాలపై నుంచి తీశారు. రైలు డ్రైవర్‌తో సహా, అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పట్టాలపై ఉన్నది ప్యాసింజర్ రైలు కాకుండా, ఎక్స్‌ప్రెస్ అయి ఉంటే, ఆ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేవి. ఆమెను ఇంకా భూమీద నూకలుండడంతో బతికి బయటపడింది. ఆత్మహత్య నుంచి బయటపడ్డ ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ కూర్చుంది. వివరాలు అడిగితే చెప్పడానికి నిరాకరించింది.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం
* చైర్మన్ బాబాప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. స్థానిక అన్నం వీర రాఘవమ్మ, రాఘవయ్య కళ్యాణ మండపంలో బుధవారం బందరు నియోజకవర్గ టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్యను అధిగమించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బత్తిన దాస్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, పార్టీ నాయకులు కాసాని భాగ్యారావు, యండూరి సురేష్, అంగర తులసీదాస్, సాతులూరి నాంచారయ్య, మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణదాతలు కావాలి
మచిలీపట్నం (కల్చరల్) : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ కోరారు. లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహనా ర్యాలీని బాబా ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, బ్లడ్ బ్యాంక్ అధికారి డా. అల్లాడ శ్రీనివాసరావు, వైద్యులు డా. వినయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

కాపులను బిసిల్లో చేర్చాలంటూ
కాంగ్రెస్ నాయకుల రిలే దీక్ష
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: కాపుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. పిసిసి పిలుపు ఏరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిలే దీక్ష చేశారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే తుని ఘటనకు బాధ్యులంటూ అమాయకులను అరెస్టు చేయడం గర్హనీయమని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. రాధికా మాధవి, అబ్దుల్ మతీన్, మత్తి వెంకటేశ్వరరావు, ఎండి దాదా సాహె బ్, రామిశెట్టి ప్రసాద్, పేరిశెట్టి నాగరాజు, కె వెంకటేశ్వరరావు, ఎస్‌కె రబ్బాని, బత్తుల యర్రబాబు, అక్తర్, గౌస్ షరీఫ్, ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.

ముద్రగడకు
మద్దతుగా ర్యాలీ
పెడన, జూన్ 15: మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు మద్దతుగా మండల పరిధిలోని పలు గ్రామాల కాపు యువకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ముచ్చర్ల, నేలకొండపల్లి, ఉరిమి గ్రామాలకు చెందిన కాపు యువకులు నేలకొండపల్లి నుంచి ర్యాలీగా పెడన తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు నిరసన తెలిపి తహశీల్దార్ ఎల్లారావుకు వినతిపత్రం అందజేశారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న డిమాండ్లను ఆమోదించాలని వినతిపత్రంలో కోరారు. తుని సంఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో గాజుల శ్రీరాంబాబు, ఎం వీరబాబు, ఎ వేణు, శ్రీహరి, బాబు పాల్గొన్నారు.

అభివృద్ధి కోసం తపించిన నేత రవణవరపు

* బుద్ధప్రసాద్ నివాళి
చల్లపల్లి, జూన్ 15: తెలుగుదనం ఉట్టిపడే ఆహర్యంతో నిరంతరం అభివృద్ధి కోసం తపించే అరుదైన నాయకుడు రవణవరపు వెంకటేశ్వరరావు అని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. ఇటీవల మృతి చెందిన వక్కలగడ్డ మాజీ సర్పంచ్, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు రామణ వరపు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను బుద్ధప్రసాద్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రవణ వరపు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాల సంఘం కురు వృద్ధునిగా విశేష సేవలందించిన రవణవరపు మృతి రైతాంగానికి తీరనిలోటన్నారు. ఆయనతో పాటు ఎంపిపి యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటిసి కృష్ణకుమారి, కెసిపి డిజిఎం ఎం రామ్మోహనరావు, వేమూరి విశే్వశ్వరరావు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, బోసు, రత్నబాబు తదితరులు ఉన్నారు.

జనరల్ కౌనె్సలింగ్ ద్వారా
జెడ్పీ ఉద్యోగుల్ని బదిలీ చేయాలి
కూచిపూడి, జూన్ 15: స్థానిక సంస్థల ఉద్యోగుల బదిలీలు జనరల్ కౌనె్సలింగ్ ద్వారా చేపట్టాలని ఎపి ఎన్జీవో మినిస్టీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చలసాని అశోక్ కుమార్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జె శ్రీరామమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొవ్వ పిఆర్‌డిఇ కార్యాలయంలో బుధవారం విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలను ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, సిఇఓ నాగార్జునసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న తమ విజ్ఞప్తిని అధికారులు విస్మరించటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు పరుస్తున్న వెబ్ కౌనె్సలింగ్‌పై నాల్గవ తరగతి ఉద్యోగులకు అవగాహన కొరవడటంతో ఆ వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హైస్కూల్ రికార్డు అసిస్టెంట్లు, నాల్గవ తరగతి ఉద్యోగులకు వెబ్ కౌనె్సలింగ్‌పై అవగాహన కొరవడటంతో జనరల్ కౌనె్సలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.