కృష్ణ

పౌష్టికాహార లోపాలను సరిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: పుట్టిన పిల్లల్లో వచ్చే పౌష్ఠికాహార లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పిల్లల్లో సంభవిస్తున్న పౌష్ఠికాహార లోపాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, యునిసెఫ్ సంయుక్తుంగా ఈ నెల 17న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియచేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సదస్సు వివరాలను తెలియచేశారు. మహిళ గర్భంలో పిండం ఊపిరి పోసుకున్నప్పటి నుంచి వెయ్యి రోజులు ప్రధానమైనవని అన్నారు. ఈ సమయంలోనే పుట్టిన బిడ్డ మెదడు పరిపక్వత చెందుతుందని అన్నారు. ఈ సమయంలోనే బిడ్డకు పౌష్ఠికాహారాన్ని సమృద్ధిగా అందించాలని అన్నారు. ఈ దశలో పౌష్ఠికాహారాన్ని అందించకపోతే, బిడ్డ భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో గర్భస్థ శిశు, శిశు మరణాలను తగ్గించేందుకు ఈ సదస్సులో చర్చ జరుగుతుందని ఆయన తెలియచేశారు. ఇటీవలే తన ఆధ్వర్యంలో యునిసెఫ్ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్టల్రో పౌష్ఠికాహారంపై చేపట్టిన కార్యక్రమాలపై అధ్యయనం చేశామని ఆయన చెప్పారు. అలాగే కేరళ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమంపై అసెంబ్లీ కమిటీనే నియమించిందని ఆయన తెలియచేశారు. శుక్రవారం జరగనున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని కోడెల తెలియచేశారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముసునూరు, జూన్ 15: ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది వ్యవసాయ బావిలో శవమై కనిపించిన సంఘటన బాసవరప్పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన పిన్నిబోయిన శ్రీనివాసరావు(30) బాసవరప్పాడు గ్రామంలోని తన మామ కోళ్ళఫారాల్లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం కోళ్ళఫారాల సమీపంలోని ఒక బావిలో శవంగా మారి పైకి తేలి ఉండటంతో గ్రామస్థులు అది చూసి స్థానిక నాయకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మైలవరం సిఐ బివి రమణ పర్యవేక్షణలో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని బావిలో ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని పైకి తీశారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో కూడా ఇటు గ్రామస్థులకు గాని, అటు మృతుడి బంధువులు గాని చెప్పకలేకపోతున్నారు. భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

వర్షంతో లంకలకు జీవకళ!
* రైతుల్లో ఆనందం
తోట్లవల్లూరు, జూన్ 15: మూడు రోజులు పడిన వర్షాలతో లంకల్లోని వాణిజ్య పంటలు కళకళలాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఎండల తీవ్రత, వడగాడ్పులు, నీరు లేక ఎండిపోయిన పంట పొలాలు ఇటీవల పడిన వర్షాలతో మళ్లీ కళకళలాడుతూ జీవకళ సంతరించుకున్నాయి. మండలంలోని కృష్ణా కరకట్ట వెంబడి రొ య్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూ రు, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి గుర్విందపల్లి, ఐలూరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలోని కృష్ణానది గర్భంలో వేలాది ఎకరాల లంక భూములు ఉన్నాయి. వీటి లో వివిధ రకాల పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ము ఖ్యంగా చెరకు, కంద, అరటి, పసుపు, తమలపాకు, కూరగాయలు, పూలు, పలురకాల అంతర పంటలు సాగవుతున్నాయి. గత ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల ప్ర భావం, నీటి కొరత కారణంగా చాలా పంటల్లో ఎదుగుదల లోపించింది. వడగాడ్పుల తీవ్రత తట్టుకోలేక మరికొన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల పడిన వర్షాలు, బోర్‌వెల్ నీటితో లంకల్లోని పంటలకు పుష్కలంగా నీరు అందినట్లైయింది. వాతావరణం చల్లబడటంతో పాటు కొంతమేర భూగర్భ జలాలు కూడా పెరిగి మోటార్ల ద్వారా నీరు బాగా రావడంతో వాణిజ్య పంటలు కళ తిరిగాయి. పంటలకు పుష్కలంగా నీరు అందితే ఎదుగుదల చక్కగా ఉంటుందని, పంట దిగుబడులు కూడా బాగుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.