కృష్ణ

ఆగస్టు 8 నాటికి పుష్కర నగర్లు సిద్ధంగా ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: ఆగస్టు 12 నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు ఆగస్టు 8నాటికే పుష్కరనగర్‌లు సిద్ధంగా ఉంచాలని సంబంధిత పుష్కర నగర్ ఇన్‌ఛార్జిలకు సబ్ కలెక్టర్ డా.జి.సృజన సూచించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ పుష్కరనగర్‌ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పుష్కరనగర్‌ల ఏర్పాటుకు తీసుకోవలసిన అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బి,ఎ,ఎ+ పుష్కర నగర్‌లలో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో నిర్మిస్తున్న దృష్ట్యా భూమి చదును, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటుపై టెండర్లు కొరకు తగిన నివేదికలు రెండురోజుల్లో సమర్పించాలన్నారు. టెంట్లు చేయడానికి టెండర్లు పిలవాల్సి ఉన్నందున పుష్కరనగర్ ఇన్‌ఛార్జిలు త్వరితగతిన ఎస్టిమేషన్‌లు తయారు చేయాలన్నారు. అదేవిదంగా పుష్కరనగర్‌ల సమీపంలో పార్కింగ్ స్థలాలపై తగినవిధంగా సిద్దం చేయాలన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు పుష్కరనగర్‌లలో ఏర్పాటు చేయవలసిన ప్రాథమిక చికిత్సా కేంద్రం, రెవెన్యూ, రెస్టుహౌస్, సంబంధిత బ్లాక్‌ల ఏర్పాటుకు విజయవాడ నగరపాలక సంస్థ తయారు చేసిన నమూనా పుష్కరనగర్ లే అవుట్‌లను అధికారులకు సబ్ కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి, వి.కృష్ణకుమారి, బందరు ఆర్డీవో పి.సాయిబాబా, నందిగామ డిఎస్‌పి డి.ఉమామహేశ్వరరావుతో పాటు వివిధ పుష్కరనగర్‌లకు నియమితులైన అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కోర్టు కేసులు ఎంతవరకు వచ్చాయ

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 18: విజయవాడ నగరపాలక సంస్థ ఎదుర్కొంటున్న కోర్టు కేసుల పరిష్కారానికి తీసుకొంటున్న చర్యలేమిటంటూ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రశ్నించారు. శనివారం తన ఛాంబర్‌లో నిర్వహించిన లీగల్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ విఎంసికి సంబంధించిన లీగల్ కేసులు 865 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అత్యధికంగా హైకోర్టులో 599, లోకల్ కోర్టులో 204, ఎపిఎటి కేసులు 32, లోకాయుక్త కేసులు 2, ప్రీ లిటిగేషన్ కౌన్సిల్‌లో 24, హ్యూమన్‌రైట్స్ కమిషన్‌లో 1, వినియోగదారుల ఫోరంలో 2తోపాటు సుప్రీం కోర్టులో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసులకు సంబంధించి తగు సమాచారంతోపాటు వాటి స్థితిగతులపై ఎప్పటికప్పుడు రిజిస్టర్‌ను ఏర్పాటుచేసి నమోదుచేయాలన్నారు. అలాగే ప్రతి గుమాస్తా కేసుల మూవ్‌మెంట్ తెలపాలన్నారు. ప్రతి నెల 4వ లీగల్‌సెల్ మీద రివ్యూ నిర్వహిస్తామని తెలుపుతూ కేసుల త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కేసుల కారణంగా విఎంసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని, అవసరమైతే సింగిల్ సెంటిల్‌మెంట్‌కు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్, లీగల్ సెల్ ఇన్‌చార్జ్ పి అరుణ్‌కుమార్, లోకల్ ఎంఎస్‌సి పి లక్ష్మీకాంత్, ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.