కృష్ణ

ఎస్సీల్లో చేర్చే వరకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 27: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రజకులు కదం తొక్కారు. బీసీలుగా ఉన్న తమను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ పుర వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. జిల్లా ఐక్య రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రజకులు హాజరై విజయవంతం చేశారు. తొలుత బస్టాండ్ సెంటరు నుండి పాదయాత్ర ప్రారంభించి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా రజక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారన్నారు. ప్రస్తుతం బిసిలలో ఉన్న తాము అత్యంత దర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా పరిగణించబడుచున్నప్పటకీ మన రాష్ట్రంలో ఇంకా బిసిలుగానే కొనసాగుతుండటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సాంకేతిక పరికరాలతో రజకులు వృత్తి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమానికి తెర లేపుతామని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన రజక వృద్ధులకు నెలకు రూ.1500 పెన్షన్లు ఇవ్వాలని, ప్రతి జిల్లాలో రజక సామాజిక భవనాలు నిర్మించాలని, రజక ఫెడరేషన్‌కు రూ.1,000 కోట్లు తక్షణమే మంజూరు చేయాలి, రజక పేద విద్యార్థులకు విదేశీ విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్టీసి, వసతి గృహాలలో ఉద్యోగ వృత్తి పనులు రజకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్ ప్రభాకరరావు, రజక ఐక్య సంఘాల అధ్యక్షులు కె జమదగ్నీ, కన్వీనర్ ఎన్ శేషు, జిల్లా రజక యువజన సమితి అధ్యక్షులు పి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణరావు, కన్వీనర్ పిఎన్‌వివి రవికుమార్, ఎం శేషు, జె మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.