కృష్ణ

స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు వివాదస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 27: విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం పలు అశాలకు ఆమోదం తెలపడం వివాదస్పదమైంది. సోమవారం ఉదయం కౌన్సిల్‌హాల్లోని స్టాండింగ్ కమిటీ సమావేశ మందిరంలో నగర మేయర్, కమిటీ చైర్మన్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదిత అంశాల ఆమోదానికి కమిటీ సభ్యులు, అధికారులకు మధ్య రసవత్తరమైన చర్చే జరిగింది. మొత్తం 58 అంశాలను సుధీర్ఘంగా చర్చించిన సభ్యులు 7/125. 8/126 అంశాల్లో ఉన్న విఎంసి కాంప్లెక్సులలోని షాపుల లీజు గడువు పొడిగింపును వాయిదా వేయడం జరిగింది. ఆమోదించిన అంశాల్లో నగరంలోని ప్రముఖ కూడలిగా ఉన్న బెంజికంపెనీ సెంటర్లో గల ట్రెండ్‌సెట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నకు ఆస్తిపన్నులో పదిశాతం రాయితీ కల్పిస్తూ ఆమోదం తెలిపారు. ట్రెండ్‌సెట్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎల్ నారాయణ విఎంసికి దాఖలు చేసుకొన్న అర్జీ ప్రకారం తమ కాంప్లెక్సు బిల్డింగ్‌లో సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్, రెయిన్ వాటర్ హార్‌వెస్ట్‌లను ఏర్పాటు చేసుకొన్నందున జివో ఎంఎస్ నెంబర్ 168 లోని 22వ క్లాజ్ ప్రకారం ఆస్తిపన్నులో 10శాతం పన్ను రాయితీ కోరగా సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలపడం గమనార్హం. గతంలో వచ్చిన ఇటువంటి అంశాలను ఒకటికి రెండు సార్లు వాయిదా వేసిన స్టాండింగ్ కమిటీ ట్రెండ్‌సెట్ బిల్డింగ్ విషయంలో మాత్రం తొలి ప్రతిపాదనకే ఆమోదం తెలపడం విశేషం. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌నకు ఆస్తిపన్ను 30లక్షల 67వేల 699 రూపాయలుగా ఉండగా స్టాండింగ్ కమిటీ ఆమోదంతో 10శాతం అనగా 3లక్షల 6వేల 699 రూపాయల మేర రాయితీ లభిస్తుంది. అయితే ఈఅంశంపై ఆమోదం పొందిన నాటి నుంచి రాయితీ ఇవ్వాల్సి ఉండగా బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన నాటి నుంచీ అనగా 1-10-2015 తేదీ నుంచీ అమలుచేస్తున్నట్టు తెలిపారు. దీంతో గడచిన సంవత్సరం పాటు పన్నులో ఆరు లక్షల, 13వేలకు పైగా పన్ను రాయితీ లభిస్తున్న తీరులో జరిగిన చర్యలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
గత ఏప్రిల్ నెలలో ఉత్తరభారత దేశంలోని 7కార్పొరేషన్ల అధ్యాయనం కొరకు విజయవాడ కార్పొరేటర్లు మొత్తం 37 మందితోపాటు ఐదుగురు అధికారుల బృందానికి అయిన ఖర్చుకు విఎంసి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 28లక్షల 68వేల 39 రూపాయలకు సభ్యులు ఏకగ్రీవంగా అమోదం తెలిపారు.
సెంట్రల్ అభివృద్ధి పనులకు ఆమోదం
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు నివేదించిన మొత్తం 33 పనులలో 8 పనులకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ జారీ చేసిన 101 జీవో ప్రకారం ఎమ్మెల్యే ఉమకు కేటాయించిన రూ.5కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆయా పనుల నిర్వహణకు శ్రీకారం చుట్టాలన్నారు. 1వ డివిజన్‌లోని ప్రశాంతినగర్ నుంచి బుడమేరు బ్రిడ్జి వరకూ సిసి రోడ్డునకు 48లక్షల 56వేలు, 20వ డివిజన్ లోని పలు రోడ్లు, సిసి డ్రైయిన్ల నిర్మాణానికి 49లక్షల 93వేలు, 42వ డివిజన్ రామకోటి మైదానం ఏరియాలో సిసి రోడ్డుకు 25లక్షలు, 42వ డివిజన్ సీతన్నపేట క్రాస్ రోడ్డు సిసిరోడ్డునకు 25లక్షలు, పిన్నాల వారి వీధి, పసలవారి వీధి తదితర రోడ్లకు సిసి రోడ్డునకు 32లక్షలు, 47వ డివిజన్ బ్రహ్మయ్య పంతులు వీధి, కొమ్మువారి వీధిలను సిసి రోడ్డు నిర్మాణానికి 25లక్షలు, 57వ డివిజన్ ప్రశాంతినగర్ 2వ క్రాస్‌రోడ్డు సిసి రోడ్డునకు 22లక్షలు, 58వ డివిజన్ విశాలాంద్ర కాలనీలోని సిసి రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణానికి 22లక్షల 63వేల రూపాయలను మంజూరు చేశారు. అలాగే జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు కొరతగా ఉన్న పారిశుద్ద్య సిబ్బంది 25మందిని నియమించడమే కాకుండా ఆగస్టు నెల వరకూ వారి జీత భత్యాలకు అవసరమైన 7లక్షల 49వేల 925 రూపాయల మంజూరు తోపాటు పారిశుద్ద్య నిర్వహణకు అవసరమైన ట్రై సైకిళ్ల కొనుగోలుకు అవసరమైన 3లక్షల 75వేల రూపాయల మంజూరుకు ప్రజారోగ్యశాఖ ప్రతిపాదించిన అంశానికి ఆమోదం లభించింది. నగరంలోని 56 కిలో మీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లిట్టర్ ఫ్రీ జోన్ ప్రాంతాలలో 24గంటల పాటు 3షిఫ్టుల పద్దతిన పారిశుద్ధ్య పనులలో ఎప్పటికప్పుడు సేకరిస్తున్న చెత్తను వేయుటకు అవసరమైన 30 డస్ట్‌బిన్ల సరఫరాకు మెస్సర్స్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ మేరకు చెల్లించాల్సిన మొత్తం 3లక్షల 45వేల రూపాయలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా పారిశుద్ద్య పనుల నిర్వహణకు లేబర్ కాంట్రాక్టర్ల నుంచి పిలిచిన టెండర్ల ప్రక్రియలకు సమ్మతిస్తూ అందుకు వారికి చెల్లించాల్సిన అరవై ఏడున్నర లక్షల రూపాయలను కూడా విడుదలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ సిఎంఇవై, డ్వాక్రా మహిళా సంఘాల వారికే పారిశుద్ధ్య పనులను అప్పగించే వారు. ప్రభుత్వం విడుదల చేసిన 279 జీవో ప్రకారం పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించిన విషయం మేరకు మొట్టమొదటి సారీగా పారిశుద్ధ్య పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం గమనార్హం.
నగరంలోని సర్కిల్-1, 2 లలో ఉన్న విఎంసి షాపింగ్ కాంప్లెక్సులలో 25ఏళ్ల లీజుకాలం ముగిసిన పలు షాపులకు మరో మూడేళ్ల పాటు లీజు గడువును పెంచేందుకు విఎంసి ఎస్టేట్ సెక్షన్ ప్రతిపాదించిన అంశాలను స్టాండింగ్ కమిటీ సభ్యులు తిరస్కరించారు.
స్విమ్మింగ్ పూల్ ఫీజుల పెంపునకు ఓకే
నగరంలో విఎంసి ఆధీనంలో నడుస్తున్న స్వీమ్మింగ్ పూల్ అడ్మిషన్ ఫీజు, నెలవారీ ఫీజులను భారీగా పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు రూ.1000, పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.200లుగా ఉంది. నగరంలోని ఎగ్జిక్యూటీవ్ క్లబ్, గుంటూరు నగరపాలక సంస్థ, ఏలూరు నగరపాలకు సంస్థ, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న మాదిరిగా అడ్మిషన్ ఫీజు రూ.1200, పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.300లను వసూలు చేయాలంటూ సభ్యులు తీర్మానించారు. ఇదిలా ఉండగా విఎంసి అధికారులు మాత్రం పెద్దలకు వెయ్యి, పిల్లలకు రూ.500 లుగా ప్రతిపాదించగా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫీజులను క్రమబద్దీకరించారు. వీటితోపాటు విఎంసి ఉద్యోగులు తమ మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ప్రకారం దాఖలు చేసుకొన్న అర్జీలకు మోక్షం లభించింది.