కృష్ణ

ప్రముఖ వ్యాపార సంస్థలో దొంగనోట్ల చెలామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూలై 2: రాష్ట్రంలోనే గాకుండా దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన ఓ సొసైటీపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఇంజనాయిల్ కౌంటరుని దొంగనోట్ల మార్పిడికి వేదికగా మార్చుకున్నాడు. ఎంతకాలం నుండి ఈ చీకటి వ్యాపారం సాగిస్తున్నాడో గాని గత నాలుగు రోజుల క్రితం సొసైటీ డైరెక్టర్లు కొందరు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఈ బండారం బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆటోనగర్‌లోని సాయి హోటల్ సమీపంలోని ఓ ప్రముఖ ఇంజనాయిల్ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్న ఓ వ్యక్తి డ్యూటీలో ఉండగా సొసైటీ డైరెక్టర్లు ఆనవాయితీగా చెక్ రిపోర్టు వేశారు. ఇంజనాయిల్ స్టాక్ క్యాష్ కౌంటర్‌లోని నగదు సరిపడా ఉండాలి కాని అమ్మకాల కంటే రూ.8,000 నగదు అదనంగా ఉంది. చెక్ రిపోర్టు వేస్తుండగా సదరు గుమాస్తా గోదాములోకి వెళ్లి వెంటనే అదే సొసైటీలో డైరెక్టరుకే సమాచారం అందించాడు. సదరు డైరెక్టరు ఆఘమేఘాలపై వచ్చి ఎక్సెస్ నగదు తనదని మిగతా డైరెక్టర్లకు చెప్పాడు. నిబంధన ప్రకారం ఎలాంటి ఆధారం లేకుండా క్యాష్ కౌంటర్‌లో నగదు ఎక్కువ ఉంటే ఆ మొత్తం నగదుని చెక్ రిపోర్టుపై నమోదు చేయాలి. అలా నమోదు చేయకుండా గుమాస్తాని వెనకేసుకొచ్చిన ఆ డైరెక్టరు ధోరణి పాలకవర్గం అంచనా వేయలేకపోయింది. అసలు విషయం ఏమిటంటే కౌంటర్‌లో ఎక్కువగా ఉన్న ఆ రూ.8000 నగదుకు సంబంధించిన వెయ్యి రూపాయల నోట్లు నకిలీ కరెన్సీ నోట్లు, సదరు గుమాస్తా కౌంటర్‌లో అదనంగా ఉన్న నగదు తనదేనని అడ్డుపడిన ఆ డైరెక్టరుకీ ఈ దొంగనోట్లకు సంబంధం ఉందా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. వినియోగదారులు ఎక్కువగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు, లేదా మెకానిక్స్ మాత్రమే ఉంటారు. బిల్లుకు సరిపడా నగదు వినియోగదారుడు కౌంటర్‌లోని గుమాస్తాకి అందించగా అవన్నీ కౌంటరులో వేసుకునే సదరు గుమాస్తా నాటకీయంగా క్యాష్ కౌంటర్‌లో సిద్ధంగా ఉంచుకున్న నకిలీ వెయ్యి నోట్లను బయటకు తీసి బాబాయి ఈ నోటు ఎక్కడైనా మార్చుకో నీవిచ్చిన నోట్లలో అది తేడాగా ఉందని తెలివిగా నకిలీ నోట్లను బయటకు పంపిస్తున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. ఇలా సొసైటీ మీద నమ్మకంతో వస్తున్న వినియోగదారులను తప్పుదారి పట్టించి చివరకు వారి నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకుని నకిలీ నోట్లను బయటకు పంపిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. జరిగిన విషయంపై బోర్డు మీటింగులో చర్చ జరుగ్గా దొంగనోట్ల మార్పిడి గుమాస్తాని వెనకేసుకొచ్చిన సదరు డైరెక్టరు బోర్డు మీటింగులో తప్పయిందని సంజాయషీ అడిగినట్టు తెలిసింది. సిబ్బంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండి ఇంజనాయిల్ ఫాల్టు వచ్చినా, కౌంటరులో నగదు హెచ్చు తగ్గులుండినా డ్యూటీలో ఉన్న గుమాస్తాకి మెమోలు ఇవ్వడం మెమోకి సమాధానం ఇచ్చినా మీరు ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా లేదని గుమాస్తాను సస్పెండు చేసిన సందర్భాలున్నాయి. యూనియన్ నాయకులు సైతం మెమోలు అందుకున్నారు. సొసైటీ గౌరవ ప్రతిష్ఠలకు , నమ్మకానికి తూట్లు పొడుస్తూ ఏకంగా దొంగ నోట్లతో పట్టుబడిన గుమాస్తాపై ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో చూడాల్సిందే. జరిగిన సంఘటన స్టీరింగు కమిటీ దృష్టికి వెళ్లింది. ఆ గుమాస్తాపైన, కొమ్ముకాసిన డైరెక్టరుపై స్టీరింగ్ కమిటీ, పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడతారో ఎదురు చూడాల్సిందేనా?

పాతబస్తీలో విస్తరణ అవసరం లేదు
పాతబస్తీ, జూలై 2: పాతబస్తీలోని రోడ్లు ఒక్క అడుగు కూడా విస్తరణ చేయాల్సిన అవసరం లేదని నగర సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. శనివారం ఉదయం సిపిఐ నాయకుల బృందం పాతబస్తీలోని తమ్మిన పోతరాజు రోడ్డును వారు సందర్శించారు. చిట్టినగర్ సెంటర్ నుండి మిల్క్ ఫ్యాక్టరీ వరకూ ఈ బృందం పర్యటించింది. ఏ ఇంటిని ఎంత మేరకు కూల్చాలనే గుర్తులు వేయగా ఆ గుర్తులను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న డివైడర్‌ని సందర్శించారు. సాయిరామ్ థియేటర్ సమీపంలో చెరువులు, దొరువులను మరిపిస్తున్న పెద్ద పెద్ద గొయ్యిలు వెంటనే పూడ్చాలని ఎర్ర జెండాలు ప్రదర్శిస్తూ ధర్నాలో నిరసన వ్యక్తం చేశారు. అసలు పాతబస్తీలో విస్తరణ అవసరం లేదని దోనేపూడి శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక కార్పొరేటర్లకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.